Farm Laws : 700 మంది రైతులు అమరులు..కేంద్రం మొండి వైఖరే కారణం

మూడు నల్ల చట్టాల రద్దు కోసం రైతుల ఆందోళన కాదని, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులందరికీ లాభదాయక ధరల చట్టబద్ధమైన హామీ లభించాలని డిమాండ్ చేసింది.

Samyukta Kisan Morcha : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్స్ తో చేపట్టిన ఆందోళనల్లో దాదాపు 700 మంది రైతులు అమరులయ్యారని, లఖింపూర్ ఖేరీలో జరిగిన హత్యలతో సహా..రైతు మరణాలకు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరే కారణమని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపణలు చేసింది. సంయుక్త కిసాన్ మోర్చా..అన్ని పరిణామాలను గమనించి..త్వరలోనే సమావేశాన్ని నిర్వహించి…తదుపరి నిర్ణయాలను ప్రకటిస్తుందని వెల్లడించింది. 2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అందులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read More : తీరం దాటిన వాయుగుండం.. కనీవినీ ఎరుగనంతగా జల ప్రళయం

ఈ ప్రకటనను పలువురు స్వాగతించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. కానీ…మూడు నల్ల చట్టాల రద్దు కోసం రైతుల ఆందోళన కాదని, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులందరికీ లాభదాయక ధరల చట్టబద్ధమైన హామీ లభించాలని డిమాండ్ చేసింది. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, విద్యుత్ సవరణ బిల్లు..ఇతర డిమాండ్లు ఇంకా పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పార్లమెంటరీ విధానాల ద్వారా కేంద్రం ప్రకటన అమల్లోకి వచ్చే వరకు వేచి ఉంటామని, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటే భారతదేశంలో ఒక సంవత్సరం పాటు సాగిన రైతుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయంగా అభివర్ణించింది.

Read More : AP Assembly : అసెంబ్లీ మార్షల్‌ను అదుపులోకి తీసుకున్న చంద్రబాబు భద్రతాసిబ్బంది

దేశ వ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ… మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. రైతులను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా… రైతులను సంతృప్తి పరచలేకపోయామని అందుకే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆందోళన చేస్తున్న రైతులు… తమ ఉద్యమాన్ని విరమించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

Read More : Three Farm Laws: రైతు చట్టాల రద్దు.. తేదీల వారీగా వివరాలు

ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఈ నిర్ణయం తీసుకుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. జూన్‌ 5, 2020  వ్యవసాయ చట్టాల రూపకల్పన జరిగినప్పటి నుంచి న్యాయం చేయాలంటూ అన్నం పెట్టే అన్నదాత న్యాయం కోసం రోడ్డెక్కాడు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టు విడవకుండా ఉక్కు సంకల్పంతో ఆందోళన చేశారు. ఎముకల కొలికే చలిని సైతం లెక్కజేయలేదు. ట్రాక్టర్లనే తాత్కాలిక నివాసాలు చేసుకొని.. రోడ్లపైనే భోజనాలు చేశారు. 15 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించి రైతు సంఘాలు కదం తొక్కాయి.. రోజుకో తీరుగా తమ పోరాటాన్ని కొనసాగించారు.. దీంతో కేంద్రం ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.. అన్నదాత ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు