Rail Roko
Rail Roko On October 18 : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై నిరసనలు చేపట్టాలని తాజాగా నిర్ణయించాయి. 2021, అక్టోబర్ 18వ తేదీన రైల్ రోకో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని రైతుల సంఘాల నేతలు ప్రకటించారు. లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో 8 మంది చనిపోవడాన్ని నిరసిస్తూ…ఆ రోజున అన్ని రైళ్లను అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు.
Read More : India’s Big Bull : స్టాక్స్ అమ్మే విషయంలో ఝున్‌ఝున్‌వాలా ఏం చేస్తారు ?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ..గత కొన్ని రోజులుగా రైతు సంఘాల నేతలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. నాయకత్వం వహిస్తున్న 40 రైతు సంఘాలు…లఖింపూర్ ఘటనను ఖండించాయి. నిరసనను వ్యక్తం చేస్తూ…సంయుక్త కిసాన్ మోర్చా రైలో రోకోకు పిలుపునిచ్చిందని ఆ సంఘం నేత, సామాజికా కార్యకర్త యోగేంద్ర యాదవ్ తెలిపారు. అంతేగాకుండా..అక్టోబర్ 15వ తేదీన దసరా పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను రైతులు దహనం చేస్తారని తెలిపారు.
యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో నిరసనలో నలుగురు రైతులతో సహా..ఎనిమిది మంది చనిపోయారు. బన్ బీర్ పూర్ సమీపంలో జరిగిన ఘర్షణలో రెండు ఎస్ యూవీలను తగులబెట్టారు. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ పర్యటనను నిరసిస్తూ…రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. లఖింపూర్ ఖేరీలో నిరసన చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లడం..తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయి. అయితే అందుకు కారణం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Read More : UP Lakhimpur : మరోసారి చీపురు పట్టిన ప్రియాంక
మంత్రిని తొలగించి..అతని కుమారుడిని అరెస్టు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో రాజకీయంగా దుమారం చెలరేగింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంతృప్తి చెందడం లేదని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నిందితులను అరెస్టు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ఏం సందేశం పంపుతున్నారు ? దేశంలోని ఇతర హత్య కేసుల్లో నిందితులను అదే విధంగా చూస్తారా ? అంటూ యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.