India’s Big Bull : స్టాక్స్ అమ్మే విషయంలో ఝున్‌‌ఝున్‌‌వాలా ఏం చేస్తారు ?

కంపెనీ యొక్క షేరు విలువ అమాంతం పెరగడంతో...కొన్ని గంటల వ్యవధిలో వాటాల విలువ రూ. 854 కోట్లు పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్ ను ఏళ్లుగా తన ఖాతాలో కొనసాగిస్తూ..లాభాలు ఆర్జిస్తున్నారు.

India’s Big Bull : స్టాక్స్ అమ్మే విషయంలో ఝున్‌‌ఝున్‌‌వాలా ఏం చేస్తారు ?

Rakesh Jhunjhunwala : గంటల వ్యవధిలో కోట్ల సంపదను ఎవరైనా సృష్టిగలరా ? అంటే…అందరి చూపు ఆయన వైపే మళ్లుతుంది. స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలను ఆయన నిశితంగా గమనిస్తూ ఉంటారు. వ్యూహాలు అనుసరిస్తూ…కంపెనీల యొక్క షేరు విలువను అమాంతం పైకి తీసుకెళ్లగలరు. కంపెనీ యొక్క షేరు విలువ అమాంతం పెరగడంతో…కొన్ని గంటల వ్యవధిలో వాటాల విలువ రూ. 854 కోట్లు పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్ ను ఏళ్లుగా తన ఖాతాలో కొనసాగిస్తూ..లాభాలు ఆర్జిస్తున్నారు. ఆయనో ఎవరో ఇప్పటికే అర్థమైంది కదూ…అవును ఆయనే ఇండియన్ బిగ్ బుల్ ‘రాకేశ్ ఝున్ ఝున్ వాలా’.

Read More : Prabhas: పాన్ వరల్డ్ స్థాయికి రెబల్ స్టార్.. తొమ్మిది భాషల్లో స్పిరిట్?

ఆయన పెట్టుబడులు ఉన్న ‘టైటన్’ కంపెనీ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 9.32 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17 వేల 700 కోట్లకు పెరిగింది. ఈ సంస్థలో ఝున్ ఝున్ వాలా, ఆయన సతీమణి రేఖాకు కలిపి 4.81 శాతం వాటాలున్నాయి. దీంతో వారి వాటాల విలువ గంటల వ్యవధిలో రూ. 854 కోట్లు పెరిగింది. ఆయన స్టాక్స్ ను ఏ ఆధారంగా విక్రయిస్తారో తాజాగా జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్ లో వెల్లడించారు. పక్కా లెక్కలతో రిస్క్ తీసుకోవడం జరుగుతుందని…ప్రతికూల పరిస్థితులు ఎదురైనా…ఎలాంటి మానసిక ఒత్తిడి, భారీ ఆర్థిక నష్టం లేకుండా చూసుకోవాలని సూచించారు. తాను మార్కెట్లను అంచనా వేయడం జరుగుతుందని, అయితే..ఈ అంచనాలు తలకిందులవుతాయన్నారు. తాను వాటి నుంచి నేర్చుకుంటానని, తప్పు చేయడానికి తాను భయపడనని. కానీ..తాను భరించగలనని అనుకుంటే…తప్పు చేస్తానన్నారు.

Read More :Mukesh Ambani: ప్రపంచ ధనికుల జాబితాలో అంబానీ.. ఎలన్ మస్క్, బెజోస్‌ల తర్వాత

స్టాక్స్ ను అమ్మడానికి తాను అమ్మడానికి మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటానని తెలిపారు. 1. రాబడి గరిష్ట స్థాయికి చేరుకుంటే 2. పీ/ఈ నిష్పత్తి గరిష్టానికి చేరితే 3. వేరే చోట మంచి పెట్టుబడి అవకాశం లభిస్తే…ఇలా మూడు సందర్భాల్లో తాను స్టాక్స్ ను విక్రయించి లాభాలు స్వీకరిస్తానని ఆయన వివరించారు. లేదంటే తాను అసలు స్టాక్స్ అమ్మే అవకాశం లేదని ఖరాఖండిగా చెప్పారు. పీ/ఈ నిష్పత్తి…అంటే వివరించారు. ప్రస్తుత స్టాక్ ధరను, ఒక్కో షేర్ పై ఆ కంపెనీ ఆర్జిస్తున్న మొత్తంతో భాగిస్తే తెలుస్తందని తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్టస్థాయిలో నమోదవతున్న క్రమంలో…దిద్దుబాటు అనేది సర్వసాధారణమని, ఇక్కడ సూచీలు తిరిగి కిందకు రావడమన్నది మాత్రం జరగదన్నారు.

Read More : UP Lakhimpur : మరోసారి చీపురు పట్టిన ప్రియాంక

కొన్ని స్టాక్స్ దిద్దుబాటుకు గురైనప్పటికీ స్థూలంగా మాత్రం కరెక్షన్ అయ్యే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ కొన్ని స్టాక్స్ పడ్డా…మరికొన్ని స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. మార్కెట్ విలువ..వాటి పోకడ..భయం..ఆశతో కూడిన మానవ ఆలోచనా తీరే నిర్దేశిస్తుందని…ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు.
ప్రభుత్వ విధానాలపై ఆయన స్పందించారు. బీపీసీఎల్, ఎల్ఐసీ, సీసీఐ, ఎస్ సీఐ వంటి కంపెనీలను కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, 2022 వరకు దాదాపు 8 నుంచి 10 కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భవిష్యత్ లో విమానయాన రంగంలో రానున్న ఎలాంటి ఫలితాలను స్వీకరించడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీవితంలో రిస్క్ తప్పనిసరి అని ఝున్ ఝన్ వాలా తెలిపారు.