ఎంపీ భార్య కామెంట్: రేప్‌ను అడ్డుకోలేకపోతే ఎంజాయ్ చేయండి

కాంగ్రెస్ ఎంపీ భార్య, జర్నలిస్ట్ లిండా ఈడెన్ వివాదస్పద కామెంట్ చేశారు. కేరళలో జర్నలిస్టుగా పని చేస్తున్న ఆమె.. ఫేస్ బుక్ ద్వారా చేసిన కామెంట్‌తో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ‘తలరాత అనేది ఓ రేప్ లాంటిది. దానిని ఎదురించలేకపోతే ఎంజాయ్ చేయాలి’ అని పోస్టు చేసింది. ఆ పోస్టులో రెండు వీడియోలు ఉంచింది. కేరళలోని తమ ఇంట్లోకి నీరు వచ్చిన విషయంతో పాటు తన భర్త ఐస్ క్రీమ్ తింటున్న సంగతిని పోస్టు చేసింది. 

తన ఇంటి ముందు నీళ్లు వచ్చిందాన్ని సరదాగా చెప్దామనుకున్న ఆమె ఇంటెన్షన్ అర్థం కాక, సోషల్ మీడియా ట్రోలింగ్ కు బలైపోతుంది. ఉద్దేశ్యం అర్థంకాక ట్రోలింగ్ చేస్తుండటంతో ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఒక్కరోజులో డిలీట్ చేసింది. ఆ తర్వాత మరో పోస్టులో క్షమాపణలు చెప్పింది.

తాను సెంటిమెంట్లను కించపరచాలని కాదని, ఈ ఘటన గురించి వాడిన పదాల నొచ్చుకునేలా ఉంటే క్షమించాలని కోరింది. 2013లోనూ సీబీఐ మాజీ డైరక్టర్ రంజిత్ సిన్హా ఇటువంటి కామెంట్లే చేసి దారుణంగా ట్రోలింగ్ కు గురయ్యాడు.