IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!

భారత వైమానిక దళంలో తండ్రీకూతురు చరిత్ర సృష్టించారు. మే 30న విధుల్లో భాగంగా వీరిద్దరూ హాక్ 132 యుద్ధ విమానాలను ఒకే ఫార్మేషన్‌లో నడిపి హిస్ట్రరీ క్రియేట్ చేశారు.

Father-daughter : భారత వైమానిక దళంలో తండ్రీకూతురు చరిత్ర సృష్టించారు. మే 30న విధుల్లో భాగంగా వీరిద్దరూ హాక్ 132 యుద్ధ విమానాలను ఒకే ఫార్మేషన్‌లో నడిపి హిస్ట్రరీ క్రియేట్ చేశారు. ఆ తండ్రీకూతుళ్లు ఎవరో కాదు.. భారత వైమానిక దళంలో ఎయిర్ కమాండర్ విధులు నిర్వర్తిస్తున్న తండ్రి సంజయ్ శర్మ ఒకరు.. ఇక ఆయన కుమార్తె అనన్య ఫ్లైయింగ్ ఆఫీస‌ర్‌.. ఇలా తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి యుద్ధ విమానాలను ఒకే ఫార్మేషన్‌లో నడపడం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలో ఇదే మొదటిసారి. భార‌త్ వైమానిక ద‌ళంలో అన‌న్య ఫ్లైయింగ్ ఆఫీస‌ర్‌గా శిక్షణలో ఉండగా.. తండ్రి సంజ‌య్ శ‌ర్మ ఎయిర్ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

సంజ‌య్ శ‌ర్మ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్సులో ఫైట‌ర్ పైల‌ట్ ఉన్నారు. 1989లో ఫైట‌ర్ పైల‌ట్ గా విధుల్లో చేరారు. అనంతరం మిగ్ 21 పైల‌టింగ్ వంటి వివిధ విభాగాల్లోనూ విధులు నిర్వర్తించారు సంజయ్ శర్మ. తన తండ్రి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)లో ఫైటర్ పైలట్, తోటి స్క్వాడ్రన్ పైలట్‌లతో పెంపొందించుకోవడం చూసింది. దాంతో అనన్య మరో ఏ ప్రొఫెషన్ గురించి ఆలోచించ‌లేదు. తన తండ్రిని చిన్న‌ప్ప‌టి చూస్తూ పెరిగిన అన‌న్య‌కు యుద్ధ‌విమానాల పైల‌టింగ్‌పై ఆస‌క్తి పెరిగింది. ఇక పేరెంట్స్ కూడా అనన్యకు పూర్తి స‌పోర్ట్ అందించారు. 2016 వ‌ర‌కు ఐఏఎఫ్‌లో ఫైట‌ర్ పైల‌ట్‌గా చేరేందుకు ప్రయత్నించింది.

Father Daughter Duo Creates History By Flying Fighter Jets Together

అప్పట్లో మ‌హిళ‌ల‌కు అవకాశం లేదు. అదే ఏడాది నుంచే ఐఏఎఫ్‌లో ఫైట‌ర్ పైల‌ట్లుగా మ‌హిళ‌ల‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌డం మొదలైంది. త‌న క‌ల‌ను సాకారం చేసుకునే అవ‌కాశం ల‌భించడంతో అనన్య సంతోషం వ్యక్తం చేసింది. అన‌న్య ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. IAF ఫ్లయింగ్ బ్రాంచ్‌కు శిక్షణ కోసం ఎంపికైంది. భార‌త వైమానిక ద‌ళంలో ట్రైనీ ఫ్లైయింగ్ ఆఫీస‌ర్‌గా చేరింది. 2021 డిసెంబ‌ర్‌లో అనన్య ఫైట‌ర్ పైల‌ట్‌గా బాధ్య‌తలు చేపట్టింది. 2022 మే 30న తండ్రీకూతురు హాక్ 132 ఫైట‌ర్ జెట్స్‌పై ఒకే ఫార్మేష‌న్‌లో విన్యాసాలు చేసి చ‌రిత్ర సృష్టించారు.

Read Also : SpiceJet: మరో స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్… ఒకే రోజు రెండు ఘటనలు

ట్రెండింగ్ వార్తలు