Financial Problem: కరోనా దెబ్బకు ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను హరించడమే కాదు.. ఆర్ధికంగా కూడా తీవ్రంగా దెబ్బ తీస్తుంది. వృత్తి వ్యాపారులు, రోజు వారి కూలి చేసుకొని జీవనం సాగించే వారి జీవితాలు కరోనా కారణంగా ఛిద్రమయ్యాయి.

Financial Problem: కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను హరించడమే కాదు.. ఆర్ధికంగా కూడా తీవ్రంగా దెబ్బ తీస్తుంది. వృత్తి వ్యాపారులు, రోజు వారి కూలి చేసుకొని జీవనం సాగించే వారి జీవితాలు కరోనా కారణంగా ఛిద్రమయ్యాయి. ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుల కోరల్లో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు.

ఇక కొందరైతే కరోనా కారణంగా అప్పులపై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజగా తమిళనాడులో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మదురై జిల్లా, ఉసిలంపట్టికి చెందిన శరవణన్‌ నగల వ్యాపారం చేస్తుంటాడు. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతింది. వ్యాపారం కోసం చేసిన అప్పులు భారీగా ఉండటంతో వాటిని తీర్చడం శరవణన్ వల్ల కాలేదు.

రోజు రోజుకు వడ్డీ పెరిగిపోతుండటం ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతుండటంతో భార్య శ్రీనిధి, పిల్లలు మహాలక్ష్మి (10) అభిరామి (5) ఆముదన్ (5) తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందు ముగ్గురు పిల్లలకు విషాదం ఇచ్చి తర్వాత వారు ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిసేపటికే నురగలు కక్కుకుంటూ ఐదుగురూ మృతిచెందారు.

స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అలాగే సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు