CM Bommai
Karnataka Polls: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా మంటలు లేచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉడిపికి వెళ్లిన సమయంలో సీఎం బొమ్మైకి ఎదురైన చేదు అనుభవం ఇది. ఉడిపి జిల్లా కొల్లురులో ఉన్న మూకాంబికా గుడి దర్శనానికి ఆయన వస్తున్నారు. అయితే ఆరేశిరూరు హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా పక్కనే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
Rajasthan : రూ.30లకే 10 పూరీలు .. దంపతుల పెద్ద మనస్సుకు హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
అయితే అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది, వెంటనే అప్రమత్తమైన మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండడంతో ప్రచారంలో స్పీడు పెంచారు. ఇటు బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుండగా.. అటు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతోంది. ఇక ఈ రెండింటికీ కాకుండా, మరోసారి కింగ్ మేకర్ అయ్యేందుకు జేడీఎస్ విస్తృత ప్రచారం చేస్తోంది.