Kolkata Fire: కోల్‌కతాలో విషాద ఘటన.. 14మంది మృతి.. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనంపై నుంచి దూకి..

కోల్‌కతాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 14మంది మృతిచెందారు.

Rituraj Hotel in central Kolkata

Kolkata Fire: కోల్‌కతాలో విషాదం చోటు చేసుకుంది. బారా బజార్ ప్రాంతంలోని మచ్చువా ఫాల్ మండి సమీపంలో రితురాజ్ హోటల్ లో మంగళవారం రాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14మంది మృతిచెందారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Also Read: Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిథిలో అపశ్రుతి.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ అగ్నిప్రమాదం గురించి మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి 8.15గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించిందని చెప్పారు. ఈ ప్రమాదం నుంచి ఇప్పటి వరకు 14మంది మృతిచెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మంటలు ఎలా సంభవించాయనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Telangana SSC Results 2025

అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. అయితే, హోటల్ లో మంటలు పెద్దెత్తున వ్యాపించడంతో ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు భవనంపై నుంచి దూకేశారు. ఆ సమయంలో అగ్నిమాపక బృందం అక్కడికి చేరుకొని పలువురి ప్రాణాలను కాపాడారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.