Peddapalli : ఢిల్లీ – చెన్నై ‘జీటీ’ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న గ్రాండ్‌ ట్రంక్‌ (GT Express) ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

Peddapalli

Peddapalli : ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న గ్రాండ్‌ ట్రంక్‌ (GT Express) ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్దపల్లి – రాఘవపూర్‌ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలను గమనించిన ఆర్పీఎఫ్ ఫైర్ సిబ్బంది వెంటనే ఆర్పివేశారు. దీంతో రైల్లోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. మంటలు రావడానికి గల కారణం తెలియరాలేదు.

Read More : Acharya: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్

శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపించిన సమయంలో బోగీలో 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే, మంటలు చెలరేగడానికి మాత్రం కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Read More : Hyderabad : పాదచారులపై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి