First Daughter Born : పుట్టిన ఆడపిల్లను హెలికాప్టర్ లో తీసుకొచ్చారు.. సంబరాలు జరుపుకున్న కుటుంబం

ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అదృష్టం అంటూ ఓ రాజస్థానీ కుటుంబం సంబరాలు జరుపుకుంది. 35 ఏండ్ల తర్వాత..లేకలేక జన్మించిన ఆ ఆడబిడ్డకు ఘన స్వాగతం పలికారు.

Rajasthan Family : కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే పుట్టకుండానే పిండం ఉసురు తీసేసే రోజులివి. అయితే..కొంతమంది మాత్రం ఆడపిల్ల పుట్టిందని తెలియగానే..తెగ సంబరపడిపోతుంటారు. ఆడపిల్లను కన్న కోడలిపై అత్తింటివారు పూల వర్షం కురిపించి ఆహ్వానించిన ఆనందకర ఘటన ఇంకా గుర్తుండే ఉంటుంది. తన బిడ్డను తీసుకొని అత్తారింటికి వచ్చిన ఆ కోడలికి మనుమరాలికి ఎవరూ ఊహించని విధంగా పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే…ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అదృష్టం అంటూ ఓ రాజస్థానీ కుటుంబం సంబరాలు జరుపుకుంది. 35 ఏండ్ల తర్వాత..లేకలేక జన్మించిన ఆ ఆడబిడ్డకు ఘన స్వాగతం పలికారు.

రాజస్థాన్ లోని నౌగోర్ జిల్లాలో నింబ్డి చందవత గ్రామానికి చెందిన హనుమాన్ ప్రజాపతి నివాసం ఉంటున్నారు. ఇతనికి చుకాదేవితో వివాహం జరిగింది. ఆ చిన్నారి తాత మదన్ లాల్ కుమ్హార్ కుటుంబంలో ఆడపిల్లలు జన్మించలేదు. కుమారుడికి ఆడపిల్ల పుట్టాలని అనుకున్నారు. చుకాదేవి గర్భం దాల్చడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. హర్సోలావ్ గ్రామంలో ఫిబ్రవరి 2వ కూతురికి జన్మనిచ్చింది. దీంతో హనుమాన్ ప్రజాపతి కుటుంబానికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

తమింట్లో అడుగుపెట్టబోయే శుభ ముహూర్తాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నారు. అందుకోసం ఏకంగా హెలికాప్టర్ ను బుక్ చేసుకున్నారు. హర్సోలావ్ గ్రామానికి చేరుకున్న అనంతరం అక్కడ పూజలు నిర్వహించారు ప్రజాపతి కుటుంబం. అనంతరం హెలికాప్టర్‌లో సొంత ఊరికి బయలుదేరారు. నింబ్డి గ్రామానికి చేరుకున్న తర్వాత…పూలతో స్వాగతం పలికారు. ఊరి ప్రజలతో ఆ ప్రాంగణం సందడిగా మారింది. డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో పాపను ఇంటికి తీసుకెళ్లారు. ఈ వేడుకకు హనుమాన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. ఊరంతా తెలిసేలా హెలికాఫ్టర్‌లో తన మనవరాలిని ఇంటికి పిలిపించుకున్నారు. ఆ పాప రాకను ఓ పండుగలా జరుపుకున్నారు.

Read More : Private Hospitals : ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా దందా.. రెమ్‌డెసివిర్‌కు రూ.18 వేలు, ఐసీయూకు రూ.40 వేలు

ట్రెండింగ్ వార్తలు