Geetanjali Iyer : తొలితరం ఇంగ్లీష్ న్యూస్ యాంకర్ గీతాంజలి అయ్యర్ కన్నుమూత.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంతాపం

గీతాంజలి అయ్యర్.. కోల్ కతాలోని లోరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె 1971లో దూరదర్శన్ లో చేరారు. 30 ఏళ్లపాటు ప్రజలకు వార్తలను అందించారు.

Geetanjali Iyer passed away : దేశంలో తొలితరం మహిళా ఇంగ్లీష్ న్యూస్ యాంకర్లలో ఒకరైన గీతాంజలి అయ్యర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆమె బుధవారం సాయంత్రం మరణించారు. గీతాంజలి అయ్యర్ మృతి పట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంతాపం ప్రకటించారు.

దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలో మొదటి ఇంగ్లీష్ న్యూస్ యాంకర్లలో ఆమె ఒకరని చెప్పారు. దూరదర్శన్ కు ఆమె చేసిన సేవలు అమోఘమని ఆయన కొనియాడారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Venus : ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా శుక్రగ్రహం.. సాయంత్రం వేళ పశ్చిమ దిశలో నేరుగా చూడొచ్చు

గీతాంజలి అయ్యర్.. కోల్ కతాలోని లోరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె 1971లో దూరదర్శన్ లో చేరారు. 30 ఏళ్లపాటు ప్రజలకు వార్తలను అందించారు. దూరదర్శన్ కెరీర్ ముగిశాక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో పని చేశారు.

ఖాందాన్ అనే సీరియల్ లోనూ ఆమె నటించారు. ఆమె నాలుగు సార్లు ఉత్తమ యాంకర్ అవార్డు అందుకున్నారు. మీడియా రంగానికి చేసిన సేవలకు గానూ 1989లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డ్ ఫర్ ఔట్ స్టాండింగ్ ఉమెన్ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు