×
Ad

First KBC 5 Crore Winner : కేబీసీ మొదటి రూ.5కోట్ల విజేత టీచర్ అయ్యారు…

కేబీసీ మొదటి రూ.5కోట్ల విజేత సుశీల్ కుమార్ టీచర్ రిక్రూట్ మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మరోసారి వార్తల్లో నిలిచారు. కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఐదు కోట్ల రూపాయల మొదటి విజేత సుశీల్ కుమార్ తాజాగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయుడి ఉద్యోగం సాధించారు.....

  • Published On : December 27, 2023 / 09:29 AM IST

KBC 5 Crore Winner Sushil Kumar

First KBC 5 Crore Winner : కేబీసీ మొదటి రూ.5కోట్ల విజేత సుశీల్ కుమార్ టీచర్ రిక్రూట్ మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మరోసారి వార్తల్లో నిలిచారు. కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఐదు కోట్ల రూపాయల మొదటి విజేత సుశీల్ కుమార్ తాజాగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయుడి ఉద్యోగం సాధించారు. మోతిహారిలోని హనుమాన్ నగర్‌లోని ఒక సామాన్య కుటుంబానికి చెందిన సుశీల్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసేవాడు.

ALSO READ : Israel issues warning : ఢిల్లీలో పేలుడు ఎఫెక్ట్…భారత్‌లో తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

కౌన్ బనేగా కరోడ్ పతి హాట్ సీట్ కు చేరుకుని తొలిసారి ఐదు కోట్ల రూపాయలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపర్చారు. ఇప్పుడు తన కష్టానికి ఫలం దక్కి బీపీఎస్సీ టీచర్‌గా మారారు. కోటీశ్వరుడైన సుశీల్ కుమార్ ఉన్నత మైన ఆదర్శాలతో సాదాసీదా జీవితం గడుపుతున్నారు. పిచ్చుకల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈయన పాటుపడుతున్నారు.

ALSO READ : Covid guidelines : మాస్కులు, వ్యాక్సిన్, ఐసోలేషన్…ఇవీ సర్కార్ తాజా కొవిడ్ మార్గదర్శకాలు

కౌన్ బనేగా కరోడ్‌పతిలో గెలిచిన తర్వాత కూడా తన చదువును కొనసాగించి విద్యారంగంలో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నానని సుశీల్ చెప్పారు. బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ యూనివర్శిటీలో సుశీల్ కుమార్ ఈ నెలలో సైకాలజీలో పిహెచ్‌డీ కోర్సులో చేరారు. టీచర్ల రిక్రూట్ మెంట్ పరీక్షల్లో మంచి ర్యాంకుతో ఉద్యోగం సాధించిన సుశీల్ కుమార్ అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.

ALSO READ : Israel issues warning : ఢిల్లీలో పేలుడు ఎఫెక్ట్…భారత్‌లో తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక