కరోనా చికిత్సకు ఎయిడ్స్ మందులు, ఇండియాలో మొదటిసారి

భారతదేశంలో మెుదటిసారిగా జైపూర్‌లో కరోనా సోకిన ఇటాలియన్ జంటకు చికిత్సకు హెచ్ఐవి మందులు Lopinavir, Ritonavir వాడుతున్నారు. వాళ్ల నుంచి అనుమతి తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కరోనా వైరస్ సోకిన వ్యక్తులపై హెచ్ఐవి మందులను వాడటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) నుంచి అనుమతి తీసుకున్నామని తెలిపారు. ఆ తరువాతే Lopinavir, Ritonavir కాంబినేషన్ ధెరపీకి ఆమోదం లభించింది. ఈ మందులను జైపూర్ ఆసుప్రతిలో చేరిన ఇటాలియన్ జంటకు వాడుతున్నారు.
కరోనాకు ఇంతవురకు ఎలాంటి చికిత్స లేదు. వ్యాధినిరోధక శక్తి తక్కువున్నవాళ్లమీద ప్రభావం ఎక్కువ. ఎయిడ్స్ కూడా ఇంతే. వ్యాధినిరోధక శక్తిని బలహీనం చేస్తుంది. అందుకే HIV మందుని చైనాలో కూడా ఉపయోగించారు. ఇది ఎలా పనిచేస్తుందో చెప్పలేము అన్నారు. పేషెంట్ల నుంచి అనుమతిని తప్పకుండా తీసుకోవాలని సీనియర్ అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ సోకిన 69 ఏళ్ల ఇటాలియన్ వ్యక్తి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడు. అతనికి జ్వరం లేదు, ఆరోగ్యం నిలకడగా ఉంది. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామని ఆశిస్తున్నాం. కరోనా సోకిన అతని భార్య కూడా మా వైద్యానికి ఒప్పుకున్నారని అన్నారు Medical and Health and Family Welfare అదనపు ఛీప్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్. భారత దేశంలో 70 శాతం మంది మాత్రం హెచ్ఐవి పాజిటివ్ రోగులు ఈ మందులున్ని వాడుతున్నారు. దేశంలోని ప్రజారోగ్య పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని అత్యవసర సమయంలో మాత్రమే ఈ మందుని వాడే విధంగా రూల్స్ చేపట్టినట్టు తెలిపారు.
See Also | అంబానీ ఇప్పుడు రిచెస్ట్ ఏషియన్ కాదు.. ఆ కిరీటం ఆలీబాబా జాక్‌మాది