Gadchiroli encounter : గడ్చిరోలీలో ఎన్ కౌంటర్… ఐదుగురు మవోయిస్టులు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మవోయిస్టులు మరణించారు.

Encounter Gadchirouli

Gadchiroli Encounter: మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మవోయిస్టులు మరణించారు.

జిల్లాలోని ఖుర్ఖేడ ఏరియా ఖోబ్రామెంద అటవీ ప్రాంతంలో మావోయస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈక్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఘటనాస్ధలంలో పరిశీలించగా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరణించిన వారిలో ఇద్దరూ మహిళా మావోయిస్టులు ఉన్నారు. పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.