Flipkart Big Billion Days తేదీ మార్పు, అమెజాన్‌కు పోటీగా..

వాల్ మార్ట్ ఓన్డ్ ఫ్లిప్‌కార్ట్‌ ప్రతి ఏటా ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరుతో విక్రయాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్స్ కు రెడీ అయ్యింది. అయ

Flipkart Big Billion Days తేదీ మార్పు, అమెజాన్‌కు పోటీగా..

Flipkart Big Billion Days

Updated On : September 26, 2021 / 4:54 PM IST

Flipkart Big Billion Days : వాల్ మార్ట్ ఓన్డ్ ఫ్లిప్‌కార్ట్‌ ప్రతి ఏటా ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరుతో విక్రయాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్స్ కు రెడీ అయ్యింది. అయితే ఈ సేల్స్ తేదీలకు సంబంధించి మార్పు జరిగినట్లు సమాచారం. అక్టోబర్ 3 నుంచి సేల్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ విక్రయాలను అక్టోబర్ 7-10 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ గత మంగళవారం ప్రకటించింది.

Lock Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?

అయితే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను 4న ప్రారంభించనున్నట్లు ప్రకటించి పోటీకి తెరతీసింది. ఈ వేడిని మరింత పెంచుతూ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ తేదీలను అక్టోబర్ 3-10కు మార్చింది.

కరోనా సంక్షోభం తర్వాత వ్యాపారులు మళ్లీ పుంజుకునేందుకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ విక్రయాలు చాలా కీలకమని, దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను ఈ కార్యక్రమం సృష్టిస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి అన్నారు. దీంతో అందరికీ లబ్ది చేకూరే విధంగా బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2021 తేదీలను మారుస్తున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. కాగా, దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్, యాప్ లో త్వరలోనే సేల్స్ కొత్త తేదీలు కనిపిస్తాయని ఫ్లిప్ కార్డ్ వర్గాలు చెబుతున్నాయి.

Google Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజింగ్‌లోనూ డేటా లీక్!!

సేల్స్ ఈవెంట్స్ విషయంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇలా పోటీపడటం ఇదేమి తొలిసారి కాదు. పండుగల సీజన్ లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డీల్స్, ఆఫర్స్ తో ఒకదానికొకటి పోటీపడతాయి.

ఫ్లిప్ కార్డ్ ఓన్డ్ మింత్రా కూడా అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ పేరుతో సేల్స్ నిర్వహించనుంది. దసరా, దీపావళి పండుగల సీజన్ లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తరహాలో మింద్రా కూడా సేల్స్ నిర్వహించనుంది.