Tamil Nadu : స్మార్ట్ ఆలోచన..పెళ్లి కొడుకు, పెళ్లి పిల్ల ఫిదా అవాల్సిందే

పెళ్లి పీటల మధ్య ముసిముసి నవ్వులతో మెరిసిపోవాల్సిన వధూవరులకు మాస్క్ కంపల్సరీ. తమిళనాడు రాష్ట్రంలోని మదురై స్వామికన్నిగైకి చెందిన పూల వ్యాపారి మోహన్...చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. చక్కటి మాస్క్ లను రూపొందించాడు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్ లను తయారు చేశాడు.

Flower Mask

Flower Vendor In Madurai : ఓ వ్యాపారి స్మార్ట్ ఆలోచనకు పెళ్లి చేసుకబోతున్న వధూవరులు ఫిదా అయిపోతున్నారు. ఏం తెలివి ? అంటూ కితాబిస్తున్నారు. స్మార్ట్ గా ఆలోచించడం కొంతమందికే సాధ్యం. కరోనా కాలంలో ఎన్నో వ్యాపారాలు నష్టపోయాయి. బిజినెస్ లేకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. కానీ కొంతమంది స్మార్ట్ గా ఆలోచిస్తూ..వ్యాపారాన్ని లాభాల బాటలోకి తెచ్చుకుంటున్నారు. కరోనా కారణంగా..మాస్క్, శానిటైజర్స్, ఫేస్ మాస్క్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. పెళ్లిళ్లు కొన్ని నియమ నిబంధనల మధ్య జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో సంతోషంగా గడుపుకోవాలని అనుకున్న వధూవరులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.

Read More : Madanapalle: మదనపల్లి పేలుళ్లు.. ఐదుగురికి గాయాలు

పెళ్లి పీటల మధ్య ముసిముసి నవ్వులతో మెరిసిపోవాల్సిన వధూవరులకు మాస్క్ కంపల్సరీ. తమిళనాడు రాష్ట్రంలోని మదురై స్వామికన్నిగైకి చెందిన పూల వ్యాపారి మోహన్…చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. చక్కటి మాస్క్ లను రూపొందించాడు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్ లను తయారు చేశాడు. వధూవరుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మాస్క్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. మూడు పొరల ముసుగులో మల్లె, లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్ లు తయారు చేశారు. కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్క్ తయారు చేశానని అంటున్నారు మోహన్. ఫ్లవర్ మాస్క్ లకు ఆర్డర్స్ వస్తున్నట్లు, పూల మాస్క్ ధరించిన వధూవరులు చూడటానికి అందంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు.