Food Delivery Agent: రెస్టారెంట్ ఓనర్ మర్డర్ కేసు హంతకుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్ కాదు..
ఢిల్లీలో జరిగిన రెస్టారెంట్ ఓనర్ మర్డర్ అంతా ఫుడ్ డెలివరీ సర్వీస్ ఏజెంట్ వైపే తిరిగింది. ఎట్టకేలకు కేసు చేధించిన పోలీసులు ఇందులో ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారని మర్డర్ కంటే..

Food Delivery Boy
Food Delivery Agent: ఢిల్లీలో జరిగిన రెస్టారెంట్ ఓనర్ మర్డర్ అంతా ఫుడ్ డెలివరీ సర్వీస్ ఏజెంట్ వైపే తిరిగింది. ఎట్టకేలకు కేసు చేధించిన పోలీసులు ఇందులో ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారని మర్డర్ కంటే ముందు గన్ ఫైట్ కూడా జరిగిందని తేల్చారు. మర్డర్‌లో డెలివరీ ఏజెంట్ నేరుగా ఇన్వాల్వ్ అవలేదని పోలీసులు తెలుసుకున్నారు.
నిందితులు పరారీలో ఉండగా వారిని పట్టుకున్నట్లు అడిషనల్ డీసీపీ గ్రేటర్ నోయిడా విశాల్ పాండే అన్నారు.
ఆర్డర్ కలెక్ట్ చేసుకోవడానికి రెస్టారెంట్ కు వెళ్లిన డెలివరీ పర్సన్.. ఆర్డర్లో ఇంకొక ఐటెం ఇంకా ప్రిపేర్ అవుతున్నట్లే చూపిస్తుందని అడిగాడు. దీంతో ఇద్దరు మధ్య వాదన పెరిగింది. వారిని అదుపుచేసే క్రమంలో సునీల్ అగర్వాల్ (రెస్టారెంట్ ఓనర్) జోక్యం చేసుకున్నాడు. ఘర్షణలో అగర్వాల్ వైపుగా కాల్పులు జరగడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
ఘటన జరిగిన సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై రెస్టారెంట్ బయట ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. రెస్టారెంట్ ఓనర్ ను కలిసి ఫుడ్ ఆర్డర్ గురించి మాట్లాడేందుకు లోపలికి వచ్చిన వికాస్ షూట్ చేసినట్లుగా తెలిసింది. ప్రధాన నిందితుడు వికాస్ కు కాలిలో గాయమైంది. దేవేందర్, సునీల్ లు పోలీసుల అదుపులో ఉన్నారు.
ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన దాని ప్రకారం.. ఆ ముగ్గురు మద్యం తాగి ఉన్నట్లుగా చెబుతున్నారు. నిందితుల నుంచి హత్యాయుధంతో పాటు మరో పిస్టల్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వికాస్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.