Foreign Tourists : విదేశీ పర్యాటకులపై నిషేధం ఎత్తివేత…నవంబర్-15 నుంచి టూరిస్ట్ వీసాలు

పర్యాటకం ద్వారా ఆర్థికరంగానికి ఊతమిచ్చే లక్ష్యంలో భాగంగా..ఏడాదిన్నరగా విదేశీ పర్యాటకులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది.

Foreign Tourists  పర్యాటకం ద్వారా ఆర్థికరంగానికి ఊతమిచ్చే లక్ష్యంలో భాగంగా..ఏడాదిన్నరగా విదేశీ పర్యాటకులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం అంతర్జాతీయ పర్యటకులకు వీసాల మంజూరు నిలిపివేసిన కేంద్రం.. టూరిస్ట్ వీసాల మంజూరుని పునరుద్దరించాలని కేంద్రప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

నవంబర్-15 నుంచి భారత్ కు వచ్చే విదేశీ పర్యాటకులకు టూరిస్ట్ వీసాలను మంజూరు చేయనున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ తెలిపింది. ఇక, చార్టర్డ్ విమానాల్లో భారత్ కు వచ్చే వారికి అక్టోబర్ 15 నుంచి వీసాలు మంజూరు చేయబడతాయని తెలిపింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ALSO READ Donald Trump : త్వరలో అమెరికా – చైనా మధ్య యుద్ధం జరగొచ్చు

ట్రెండింగ్ వార్తలు