Donald Trump : త్వరలో అమెరికా – చైనా మధ్య యుద్ధం జరగొచ్చు

చైనా యుద్దానికి సిద్దమవుతూన్నట్లు కనిపిస్తోందని.. యుద్ధ ఆలోచనతోనే తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలను పంపుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Donald Trump : త్వరలో అమెరికా – చైనా మధ్య యుద్ధం జరగొచ్చు

Donald Trump

Updated On : October 7, 2021 / 7:20 PM IST

Donald Trump : తాజా పరిణామాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా యుద్దానికి సిద్దమవుతూన్నట్లు కనిపిస్తోందని.. యుద్ధ ఆలోచనతోనే తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలను పంపుతుందని వ్యాఖ్యానించారు. చివరకు చైనాతో అగ్రరాజ్యం యుద్ధం చేసేలా ఉందన్నారు ట్రంప్. అమెరికాలోని ప్రస్తుత బలహీన, అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏమాత్రం గౌరవించడం లేదని అన్నారు.

Read More : Lakhimpur Kheri Violence : ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అరెస్ట్..కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు

త్వరలో చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్నారన్న వార్తల నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖలు చేయడం గమనార్హం. ఇక అఫ్ఘాన్ విషయంలో బైడెన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ట్రంప్ మండిపడ్డారు. అఫ్ఘాన్ లో 8500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను వదిలేసి వచ్చారు ఇప్పుడు వాటిని చైనా, రష్యా రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా సొంతంగా తయారు చేసుకుంటాయని ట్రంప్ అన్నారు.

Read More : Donald Trump : మరోసారి కోర్టు మెట్లెక్కిన ట్రంప్

అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచారని మరోసారి ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు ట్రంప్. చైనా దూకుడును రిగ్గింగ్ ద్వారా గెలిచిన అధ్యక్షుడు అడ్డుకోలేకపోతున్నాడని విమర్శలు గుప్పించాడు ట్రంప్.