మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది.

Manmohan Singh భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరిని మహమ్మారి తన గుప్పిట్లోకి లాక్కుంటోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఈ లిస్ట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చేరారు.

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. మన్మోహన్ సింగ్ ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఆదివారం కరోనా కట్టడి విషయమై 5 ప్రధాన సూచనలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మన్మోహన్ సింగ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. మోడీకి రాసిన రెండు పేజీల లేఖలో మన్మోహన్.. వ్యాక్సినేషన్ వేగం పెంచడం వంటి పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ట్రెండింగ్ వార్తలు