Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..

పరిస్థితి విషమించడంతో మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.

Manmohan Singh

Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. గురువారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో మన్మోహన్ సింగ్ కు వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.

మన్మోహన్ సింగ్ (92) మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. వయో సంబంధిత వైద్య పరిస్థితులతో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. గురువారం రాత్రి 8గంటల 6 నిమిషాలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని మెడికల్ ఎమర్జెన్సీకి ఆయనను తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. మన్మోహన్ సింగ్ రాత్రి 9గంటల 51 నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. మనోహన్ సింగ్ మృతిపై ఎయిమ్స్ మీడియా సెల్ ఇంచార్జ్ డాక్టర్ రిమా దా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Also Read : సంధ్య థియేటర్ లాంటి ఘటనలు జరక్కుండా ఏం చేయాలి? స్టార్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిర్మాత సురేశ్ బాబు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..