Former Speaker Of Karnataka Kr Peta Krishna Died
KR Peta Krishna :కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్‌పేట కృష్ణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న కృష్ణ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. మాండ్యా జిల్లాలోని కెఆర్ పీట్ తాలూకాలోని తన స్వగ్రామమైన కొట్టమరనహళ్లిలో శనివారం తుది కర్మలు నిర్వహించారు. 1985, 1994 మరియు 2004 లో మూడుసార్లు కె.ఆర్ పీట్ అసెంబ్లీ నియోజకావర్గం నుంచి జనతా పార్టీ, జెడి (ఎస్) పార్టీల తరపున గెలిచారు.
1996 లో మాండ్య లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 2004-08 వరకు కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. పశుసంవర్ధక మరియు సెరికల్చర్ మంత్రిగా కూడా సేవలందించారు. కృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప, మాజీ ప్రధాని హెచ్‌డి దేవేగౌడ తీవ్ర సంతాపం తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు మంత్రులు, జెడి(ఎస్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య కూడా సంతాపం తెలిపారు.