Babul Supriyo : పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ…టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే బాబుల్ సుప్రియో బీజేపీని వీడారు.

Babul
Babul Supriyo joined TMC : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పుల తర్వాత సుప్రియో బీజేపీని వీడారు. అయితే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించిన సుప్రియో.. తృణమూల్‌లో చేరడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరచింది. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని సమాజ సేవ మాత్రమే చేస్తానని బాబుల్ సుప్రియో అన్నారు.
తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో బాబుల్ సుప్రియో బీజేపీని వీడారు. అయితే బీజేపీని వీడిన సుప్రియో.. ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సుప్రియో బరిలోకి దిగారు. టీఎంసీ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో ఆయన ఓటమి చవి చూశారు.
West Bengal : మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంక..!
ఇటీవల మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ నుంచి వలస వచ్చినవారిలో బాబుల్ సుప్రియో ఐదో వ్యక్తి. ఇటీవల నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు.