Former Uttarakhand C.M : కారు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రికి గాయాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి డివైడర్‌ను ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి....

Former Uttarakhand C.M : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి డివైడర్‌ను ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో తన కారు డివైడర్‌ను ఢీకొనడంతో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వెన్నునొప్పితో ఆసుపత్రి పాలయ్యారని ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సురేంద్ర కుమార్ తెలిపారు.

Also Read : Earthquake : అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ నాల్గవసారి భూకంపం

రావత్ కొంతమంది కార్మికులతో కలిసి మంగళవారం అర్థరాత్రి ఉధమ్ సింగ్ నగర్‌లోని హల్ద్వానీ నుంచి కాశీపూర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాజ్‌పూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో తన కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముందు సీటులో కూర్చున్న రావత్‌కు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

Also Read : Kannada actor Darshan : వెలుగుచూసిన కన్నడ నటుడి పులిగోరు ఫొటోలు…అటవీశాఖ అధికారుల సోదాలు

తన కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో షాక్‌కు గురయ్యానని, ఆ తర్వాత తాను చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లానని మాజీ సీఎం చెప్పారు. అంతా బాగానే ఉందని డాక్టర్లు చెప్పి డిశ్చార్జి చేశారన్నారు. ‘‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను, నా సహచరులు క్షేమంగా ఉన్నాం’’ అని హరీష్ రావత్ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు కాశీపూర్ నుంచి డెహ్రాడూన్‌కు వస్తుండగా ప్రమాదం జరగడంతో జాలీ గ్రాంట్ ఆసుపత్రిలో చేరినట్లు రావత్ పీఆర్వో కుమార్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు