Earthquake : అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ నాల్గవసారి భూకంపం

అఫ్ఘానిస్థాన్ దేశంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. అఫ్ఘానిస్థాన్ దేశంలో గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది...

Earthquake : అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ నాల్గవసారి భూకంపం

Afghanistan Earthquake

Updated On : October 26, 2023 / 5:43 AM IST

Earthquake : అఫ్ఘానిస్థాన్ దేశంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. అఫ్ఘానిస్థాన్ దేశంలో గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. అఫ్ఘానిస్థాన్ దేశంలో సంభవించిన ఈ భూకంపం నాల్గవసారి. ఇటీవల హెరాత్ ప్రావిన్సులో సంభవించిన భూకంపం వల్ల 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read :  Kannada actor Darshan : వెలుగుచూసిన కన్నడ నటుడి పులిగోరు ఫొటోలు…అటవీశాఖ అధికారుల సోదాలు

అంతకుముందు అక్టోబర్ 15 న అఫ్ఘానిస్థాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకు ముందు అక్టోబర్ 13న ఆఫ్ఘనిస్తాన్‌లో 4.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అక్టోబర్ 11వతేదీన రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. గత వారం సంభవించిన భారీభూకంపం వల్ల 4వేలమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది నివాస గృహాలు కూలిపోయాయి.

Also Read : MLA Haripriya : ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ

హెరాత్‌లోని 20 గ్రామాల్లో శనివారం 1,983 నివాస గృహాలు ధ్వంసమయ్యాయని తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హెరాత్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపంలో మృతులు,క్షతగాత్రుల సంఖ్యను గాయాల సంఖ్యను తాలిబాన్ సర్కారు ఇంకా అంచనా వేయలేదు. మరో వైపు చైనాలోని జిన్‌జియాంగ్‌లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.