Parliament : పార్లమెంట్ ఘటనలో నలుగురు అరెస్ట్.. మూడు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తింపు..

పార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.

Lok Sabha Speaker Om Birla

Lok Sabha tear gas incident : పార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. హర్యానాకు చెందిన నీలం,మహారాష్ట్రకు చెందిన ఆమోల్ షిండే, కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, దేవరాజ్‌లుగా గుర్తించారు. అరెస్ట్ చేసిన వీరిని ఢిల్లీ పోలీసులు, యాంటీ టెర్రర్ యూనిట్ స్పెషల్ సెల్ విచారిస్తోంది. ఈ ఘటనపై లోక్‌సభ  స్పీకర్  ఓం బిర్లా మాట్లాడుతు..దీనిపై దర్యాప్తు జరుగుతోందని..భద్రతా అంశాలపై అన్ని పార్టీల నేతలతో చర్చిస్తామని తెలిపారు. యథావిధిగా సభా కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.

Lok sabha : లోక్‌స‌భ‌లో భద్రతా వైఫల్యం.. సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఉలిక్కిపడ్డ ఎంపీలు

కాగా..పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో  భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. లోక్‌స‌భ‌ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుండి సభలోకి వచ్చారు. అందులో ఒకరు స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంపీలు భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో బయటకు పరుగులు పెట్టారు. అప్రమత్తమైన భద్రత సిబ్బంది అగంతకులను అదుపులోకి తీసున్నారు.

వారి వద్ద నుంచి టియర్ గ్యాస్ సెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జీరో అవర్ లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. అయితే, గందరగోళం తొలగిన కొద్దిసేపటికే లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. ఇదిలాఉంటే.. 22ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే రోజున ఇలాంటి ఘటన చోటుచేసుకోవటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.