నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

  • Publish Date - April 1, 2019 / 02:58 AM IST

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో సోమవారం(1 ఏప్రిల్ 2019)తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన నలుగురు కూడా లష్కరే తోయిబా ఉగ్ర‌వాదులు అని అధికారులు చెబుతున్నారు.

లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ప‌క్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. ముష్కరులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు.. నలుగురు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

ఎన్‌కౌంటర్ అనంతరం.. సంఘటనా స్థలం నుండి రెండు ఏకే రైఫిల్స్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌‌ను, ఒక పిస్టోల్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చివరివార్త అందేవరకు సెర్చ్ ఆపరేషన్‌ను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.