Free Power Supply: కశ్మీరీ పండిట్ షాప్‌లకు ఉచిత కరెంట్

కశ్మీర్ పండిట్‌ల షాప్‌లకు ఢిల్లీ గవర్నమెంట్ ఉచిత గవర్నమెంట్ ఇవ్వనుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మంగళవారం వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్లకు, ట్రాన్సాఫార్మర్ల ఇన్‌స్టాలేషన్లకు అయ్యే ఖర్చులన్నీ కేజ్రీవాల్ ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఒక నెలలోగా పనులన్నీ పూర్తయిపోతాయని తెలిపారు.

Free Power Supply: కశ్మీరీ పండిట్ షాప్‌లకు ఉచిత కరెంట్

Kashmiri Pandit

Updated On : June 1, 2022 / 11:38 AM IST

 

Free Power Supply: కశ్మీర్ పండిట్‌ల షాప్‌లకు ఢిల్లీ గవర్నమెంట్ ఉచిత గవర్నమెంట్ ఇవ్వనుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మంగళవారం వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్లకు, ట్రాన్సాఫార్మర్ల ఇన్‌స్టాలేషన్లకు అయ్యే ఖర్చులన్నీ కేజ్రీవాల్ ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఒక నెలలోగా పనులన్నీ పూర్తయిపోతాయని తెలిపారు.

“ఢిల్లీలోని కశ్మీరీ పండిట్ల సమస్యలను రాజకీయం చేయకుండా వారి అభ్యున్నతికి కృషి చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుందని” డిప్యూటీ సీఎం అన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో, కశ్మీరీ పండిట్ల కష్టాలను వివరించే చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కామెంట్ చేశారు.

Read Also : శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ ని కాల్చిచంపిన టెర్రరిస్టులు

బీఎస్‌ఈఎస్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌తో సహా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సిసోడియా సమావేశం నిర్వహించారు. ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేయడానికి కేటాయించిన స్థలాన్ని తక్షణమే పరిశీలించాలని ఆదేశించారు. ఒక నెలలోగా విద్యుత్ కనెక్షన్‌లు ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు.

అంతకుముందు, కశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందం INA మార్కెట్‌లో 100 కంటే ఎక్కువ కశ్మీరీ పండిట్‌ల దుకాణాలున్నాయని, వివిధ నిర్మాణ కార్యకలాపాల కారణంగా గతంలో చాలాసార్లు విద్యుత్ కనెక్షన్ల సమస్య గురించి కేజ్రీవాల్‌కు వివరించింది.