Free Ration : ఉచిత రేషన్ పథకం పొడిగింపు.. ఎన్ని నెలలంటే

శనివారం మంత్రి మండలి మొదటి మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ‘ఉఛిత రేషన్ పథకం’ను పొడిగించాలని నిర్ణయించారు. మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు...

Free Ration Scheme : ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం గెలిచిన పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. యూపీలో, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ప్రధానంగా యూపీలో మరోసారి అధికారం నిలబెట్టుకుంది బీజేపీ. దీంతో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు.. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చిన పథకాలను కొన్నింటిని కంటిన్యూ చేయాలని సీఎం యోగి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. శనివారం మంత్రి మండలి మొదటి మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఉఛిత రేషన్ పథకం’ను పొడిగించాలని నిర్ణయించారు. మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు యూపీ సీఎం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 15 కోట్ల పేదలకు ఉచిత రేషన్ అందనుందని అంచనా.

Read More : Yogi Adityanath Oath : రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం

యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉచిత రేషన్ పథకం కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. కరోనా సమయంలో యూపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పేదలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, పథకాలను ప్రజలకు అందించాలన్నదే తమ తపన అని డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ వెల్లడించారు. సీఎం యోగి తీసుకున్న నిర్ణయంతో సుమారు 15 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరుతుందని.. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ. 3 వేల 270 కోట్ల భారం పడుతుందని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. యూపీలో మొత్తం 403 స్థానాలున్నాయి. ఇక్కడ ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మార్చి 11వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకోగా.. ఈసారి జరిగిన ఎన్నికల్లో 253 స్థానాల్లో విజయదుందుభి మ్రోగించి అధికారంలోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు