Viral Video : బాబోయ్.. సమోసాలో కప్ప కాలు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. స్వీట్ షాపులో సమోసా తినేందుకు అదే ప్రాంతానికి చెందిన అమన్ శర్మ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో

Viral Video : బాబోయ్.. సమోసాలో కప్ప కాలు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

frog leg in samosa

Frog Leg in Samosa : మీరు సమోసా తింటున్నారా.. అయితే జాగ్రత్త.. తినేటప్పుడు కాస్త చూసుకొని తినండి.. ఎందుకంటే సమోసాలో కప్పు కాళ్లు, ఇతర నాన్ వెజిటేరియ్ పదార్థాలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, కాస్త సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఆ వీడియో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది కాదు. ఈ ఘటన చోటు చేసుకుంది ఘజియాబాద్ ప్రాంతం ఇందిరాపురంలోని ఓ స్వీట్ దుకాణంలో. సమోసా తింటుండగా కప్పకాలును చూసి వ్యక్తి తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీంతో దుకాణం దారుడితో వాగ్వివాదంకు దిగాడు.

Also Read : Natasa Stankovic : ముంబై వీధుల్లో కారులో బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా మాజీ భార్య చ‌క్క‌ర్లు

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. స్వీట్ షాపులో సమోసా తినేందుకు అదే ప్రాంతానికి చెందిన అమన్ శర్మ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్వీట్ షాపుకు వెళ్లాడు. ముగ్గురు అక్కడే సమోసా తిందామనుకున్నా షాపులో రద్దీగా ఉండటంతో మూడు సమోసాలను పార్శిల్ తీసుకెళ్లారు. రూం వద్దకు వెళ్లి సమోసా తినేందుకు ఓపెన్ చేయగా అమన్ శర్మ, అతని స్నేహితులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అమన్ శర్మ సమోసాలో కప్ప కాలును ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ముగ్గురు తిరిగి షాపు వద్దకు వెళ్లారు.

Also Read : ఎంత క్యూట్‌గా ఉందో.. మూడేళ్ల చిన్నారి పాడిన పాటకు నెటిజన్లు ఫిదా.. రికార్డు స్థాయిలో వ్యూస్.. వీడియో వైరల్

సమోసాలో కప్ప కాలు ఉండటాన్ని షాపు యాజమానికి చూపించి గొడవకు దిగారు. కొద్దిసేపటికే దుకాణం వద్ద ప్రజలు గుమ్మిగూడారు. కానీ, కప్ప కాలు సమోసాలోకి ఎలా వచ్చిందో షాపు యాజమాని సమాధానం ఇవ్వకపోవటంతో అమన్ శర్మ, అతని స్నేహితులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు అక్కడికి చేరుకోవటంతో వివాదం సర్దుమణిగింది. ఫుడ్ సేప్టీ అధికారి దుకాణం వద్దకు చేరుకొని సమోసా శాంపిల్ తీసుకొని పరీక్షకు పంపించారు. నివేదిక వచ్చిన తరువాత షాపు యాజమానిదే తప్పు అని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.