Covid Deaths Down : జూన్ నుంచి కరోనా మరణాలు తగ్గనున్నాయి.. వ్యాక్సిన్ల సరఫరా పెంచాల్సి ఉంది

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుతోంది. కానీ, కరోనా మరణాలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంఖ్య భారత్‌లోనే నమోదైంది.

Covid Deaths to Go Down from June : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుతోంది. కానీ, కరోనా మరణాలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంఖ్య భారత్‌లోనే నమోదైంది. రోజువారీ టీకాల సంఖ్య కూడా క్రమంగా మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొవిడ్ -19 కారణంగా రోజువారీ మరణాల సంఖ్య జూన్ నుంచి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

దేశంలో సీరం, భారత్ బయోటెక్ రెండు టీకాల సరఫరాను పెంచడంతో పాటు రాష్ట్రాల లాక్‌డౌన్ సడలింపులతో జూన్‌ నుంచి కరోనా మరణాల్లో తగ్గుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడు రోజుల వృద్ధి రేటు మైనస్ 3.1 శాతం మధ్య, మే 7న 4.14 లక్షల కేసుల గరిష్ట స్థాయిని తాకింది. మే 18న రోజువారీ కేసుల సంఖ్య 2.63 లక్షలకు తగ్గింది. రోజువారీ మరణాల సంఖ్య మే 18న 4529 గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు రోజు అత్యధికంగా 4329 మరణాలు నమోదు కాగా.. మే 12న 4205 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా కరోనా మరణాల సంఖ్య 4409 నమోదైంది. కొత్త కేసుల కంటే మరణాల సంఖ్య 15-20 రోజుల వ్యవధిలో ఎక్కువగా ఉన్నాయి.

రోజువారీ కేసులు ఇప్పుడు తగ్గుతున్నందున జూన్ ప్రారంభంలో రోజువారీ సంఖ్య మరణాలు తగ్గుతాయని భావిస్తున్నామని ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలుతో పాటు టీకా కొరతను అధిగమిస్తామని వెల్లడించారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించడం ద్వారా కరోనా మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. భారత్‌లో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల సంఖ్యను పెంచేదిశగా ప్రయత్నాలు చేపట్టారు. రోజుకు 25లక్షలకు పైగా డోసులు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

జూన్‌ నుంచి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. 45ఏళ్లు పైబడిన వారికి టీకాలను పూర్తిగా అందించి.. ఆ తర్వాత వెంటనే 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. 18-44 వయస్సు గలవారికి టీకాలు వేయడంలో 10 లక్షల మార్కును దాటిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. మరికొన్ని పెద్ద రాష్ట్రాల్లో కూడా జూన్ నుండి రెండు టీకాలు పూర్తిస్థాయిలో అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు సీనియర్ అధికారి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు