IT Engineer : ఐటీ ఇంజినీర్ల‌కు ఫుల్ డిమాండ్.. 120% వేత‌నం హైక్ ఇస్తున్న దిగ్గజ కంపెనీలు

దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో నూతన నియామకాలు ఊపందుకున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కోసం టీసీఎస్‌ , ఇన్ఫోసిస్‌, విప్రో అత్యంత ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్లతో కూడిన ప్యాకేజీని ప్ర‌క‌టించాయి.

It Engineer

IT Engineer : దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో నూతన నియామకాలు ఊపందుకున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కోసం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, విప్రో అత్యంత ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్లతో కూడిన ప్యాకేజీని ప్ర‌క‌టించాయి. గతంలో ఐటీ కంపెనీలు 10 నుంచి 30 శాతం శాలరీ హైక్ ఇచ్చేవి.. ప్రస్తుతం 70 నుంచి 120 వేతనం పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా సమయంలో ఐటీ నియామకాలు భారీగా తగ్గాయి.. కరోనా ఉదృతి తగ్గి అన్ని సేవలు అందుబాటులోకి రావడంతో ఉద్యోగుల కొరత ఏర్పడింది. ఇదే ఐటీ కంపెనీలు దూకుడుగా నియామ‌కాలు చేప‌ట్ట‌డానికి కార‌ణంగా తెలుస్తోంది.

Read More : Chiranjeevi:ఇబ్బంది పెట్టొద్దు.. పట్టించుకోండి ప్లీజ్.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

ఐటీ నిపుణుల‌కు సుమారు 400 శాతం డిమాండ్ ఉంద‌ని ఇండీడ్ ఇండియా అనే జాబ్ సెర్చ్ పోర్ట‌ల్ నివేదించింది. అప్లికేష‌న్ డైవ‌ల‌ప‌ర్‌, లీడ్ క‌న్స‌ల్టెంట్‌, సేల్స్ ఫోర్స్ డెవ‌ల‌ప‌ర్‌, సైట్ రిల‌య‌బిలిటీ ఇంజినీర్ వంటి స్కిల్డ్ సాంకేతిక నిపుణుల‌ కొరత తీవ్రంగా ఉందని ఇండీడ్ ఇండియా పేర్కొంది. కొంతకాలం పనిచేసిన వెళ్లిన మహిళా ప్రొఫెషనల్స్ నియామక డ్రైవ్ చేపట్టినట్లు తాజాగా టీసీఎస్ ప్రకటించింది.

Read More : Drugs : భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. విజయవాడతో సంబంధాలు!

అనుభ‌వ‌జ్ఞులైన మ‌హిళా నిపుణుల‌కు తిరిగి ప‌నులు ప్రారంభించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు టీసీఎస్ తెలిపింది. ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది శుభపరిణామం అని ఇండీడ్ ఇండియా తెలిపింది. ఆకర్షణీయమైన జీతంతో పాటు మంచి ప్రోత్సకాలు అందించేందుకు ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయని వివరించారు.