నార్త్ ఇండియాలో మండుతున్న ఎండలపై ఫన్నీ మీమ్స్, జోక్స్

మండుతున్న ఎండలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. వేడి గాలుల నుంచి ఉపశమనం పొందేందుకు నెటిజనులు జోకులు, ఫన్నీ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.

Funny Memes on Heatwave: నార్త్ ఇండియాను ఎండలు వణికిస్తున్నాయి. ఉక్కపోతతో ఉత్తర భారతం మండిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఎండలు ఇరగదీస్తున్నాయి. ఢిల్లీ చరిత్రలో రికార్డు స్థాయిలో తొలిసారి గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయిదంటే హీట్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. ఢిల్లీ ముంగేష్పూర్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఢిల్లీ చరిత్రలో నమోదైన హయ్యస్ట్ టెంపరేచర్ ఇదేనని అధికారులు ప్రకటించారు. మంగళవారం నాడు ముంగేష్పూర్, నరేలా ప్రాంతంలో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

రాత్రి పూట కూడా 30 డిగ్రీలకు పైగా టెంపరేచర్ ఉండటంతో ఢిల్లీవాసులు అల్లాడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువసేపు వినియోగిస్తుండటంతో ఢిల్లీలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఢిల్లీలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 8302 మెగావాట్లగా నమోదయినట్టు డిస్కమ్ అధికారులు తెలిపారు. మే 22న మొదటిసారి రికార్డు స్థాయిలో పీక్ పవర్ డిమాండ్ 8000 మెగావాట్లుగా నమోదయినట్టు చెప్పారు.

Also Read: 2 రోజుల ముందుగానే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..! ఎండలు మండిపోవడానికి కారణమేంటో తెలుసా?

మండుతున్న ఎండలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. కాల్చుకుతింటున్న వేడి గాలుల నుంచి ఉపశమనం పొందేందుకు నెటిజనులు జోకులు, ఫన్నీ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. వీరు కూడా వాటిని చూసి కాసేపు సరదాగా నవ్వుకోండి.

 

 

 

 

 

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు