9 వేల కొబ్బరికాయలతో గణపతి తయారీ

బెంగళూరులో కొబ్బరికాయల గణపతి విశేషంగా ఆకట్టుకుంటోంది. 9 వేల కొబ్బరి బొండాంలతో ఈ గణేషుని రూపొందించారు.

  • Publish Date - September 1, 2019 / 10:12 AM IST

బెంగళూరులో కొబ్బరికాయల గణపతి విశేషంగా ఆకట్టుకుంటోంది. 9 వేల కొబ్బరి బొండాంలతో ఈ గణేషుని రూపొందించారు.

వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతీ గల్లీలో సందడి నెలకొంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలతో స్వామి వారిని కొలుస్తారు. గల్లీ గల్లీకో రకమైన వినాయకుడి విగ్రహం దర్శనమిస్తుంటుంది. చాలా రకాల రూపాల్లో, ఆకర్షణీయ రంగుల్లో ఆ వినాయకుడిని రూపొందిస్తారు. 

బెంగళూరులో కొబ్బరికాయల గణపతి విశేషంగా ఆకట్టుకుంటోంది. 9 వేల కొబ్బరి బొండాంలతో ఈ గణేషుని రూపొందించారు. పుట్టెంగలిలో ఏర్పాటు చేసిన ఈ గణపతిని తయారు చేయడానికి 20 రోజులు పట్టింది. 75 మంది వర్కర్లు గణపతి తయారీలో నిమగ్నమయ్యారు. 

పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని కొబ్బరి కాయలతో గణపతిని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గణపతి నిమజ్జనం తర్వాత ఈ కొబ్బరి బొండాలను భక్తులకు ప్రసాదంగా పంచనున్నారు. ఈ గణేషుడిని రూపొందించడానికి  21 రకాల కూరగాయలను కూడా వినియోగించారు.

Also Read : శిశువుకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

ట్రెండింగ్ వార్తలు