శిశువుకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 12:25 PM IST
శిశువుకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

Updated On : May 28, 2020 / 3:44 PM IST

ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీనికి కారణమైన 17 ఏళ్ల బాలుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం తిరుప్పూర్ జిల్లా వడుకపాళెయం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినికి కడుపు నొప్పి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె గర్భంతో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించి, ప్రసవ వార్డుకి తరలించారు. శుక్రవారం విద్యార్థిని ప్రసవించింది. ఆడశిశువుకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న మహిళా పోలీసులు ఈ ఘటనపై విచారించారు. 

ఇంటర్మీడియట్ చదివే సమయంలో తోటి విద్యార్థితో బాలికకు పరియం ఏర్పడి, అది ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు అతన్ని చదువు మానిపించి, పనికి పంపించారు. ఆ సమయంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం ఆమె ఇంట్లో చెప్పకుండా అలానే స్కూల్ కు వెళ్లేది. కడుపు నొప్పి రావడంతో విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం 

కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనే బాలిక ప్రసవించింది. శిశువును ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాగా దీనికి కారణమైన బాలుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.

Also Read : 9 వేల కొబ్బరికాయలతో గణపతి తయారీ