భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కొంతమంది ఎవరో సత్యాగ్రహం చేసినందుకే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తున్నారు. బ్రిటీష్ వాళ్లు ఫ్రస్టేషన్‌కు గురై స్వరాజ్యం ఇవ్వలేదు. చరిత్ర చదువుతుంటే నా రక్తం మరిగిపోతుంది. అలాంటి వారిని మన దేశంలో మహాత్ములు అని పిలుస్తున్నారు’ అని అన్నారు.
స్వాతంత్ర్యం గురించి జరిగిన సంఘటనలపై అదో పెద్ద డ్రామా అని అంటూ.. ‘ఈ నాయకులలో ఒక్కరు కూడా పోలీసుల చేతిలో ఒక్క దెబ్బ కూడా రుచి చూడలేదు. అదో పెద్ద డ్రామా. బ్రిటీష్ వాళ్ల ఆమోదంతో జరిపిన పెద్ద నాటకమది’
‘నేటి రాజకీయాలతో సావర్కర్‌ను పోల్చి చెప్తూ.. భారత స్వరాజ్యం ఎందరో త్యాగాల ఫలం. ఎన్నో ప్రాణాలు ఆయుధాలకు బలి అయ్యాయి. వినాయక్ దామోదర్ సావర్కర్ సొంత ఆలోచనలతో పోరాడారు. భారత జాతి కోసం పోరాడిన వ్యక్తి’ అని చెప్పుకొచ్చారు.
వీటిపై బీజేపీ అధికార ప్రతినిధి జీ మధుసూదన్ మాట్లాడుతూ.. మేమంతా మహాత్మగాంధీని గౌరవిస్తాం. కానీ, ఇటువంటి చీప్ రిమార్క్‌లను సపోర్ట్ చేయమన్నాడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు జబ్బు చేసింది. స్వాతంత్ర్య సంగ్రామం గురించి బేసిక్స్ కూడా తెలియవు. గాడ్సే, సావర్కర్ లాంటి వ్యక్తుల నుంచి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.