వైరల్ వీడియో: ఇది కదా అమ్మాయి పవర్ అంటే.. భారీ డోలుపై నిలబడి.. చీరకట్టులో పూనకం వచ్చినట్టు వాయించేసింది..

ఏంటి ఈ కొట్టుడు.. అబ్బాయిలు కూడా ఇలా వాయించలేరు.. రోమాలు నిక్కబొడుచుకునేలా..

Pune Dhol-Tasha Video: గణేశ్ ఉత్సవాలంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా పుణేలో జరిగే వేడుకలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. అక్కడి ‘ధోల్-తాషా’ వాయిద్యాల హోరు ఆకాశాన్ని తాకుతుంది. అలాంటి ఓ ఉత్సవంలో, ఒక అమ్మాయి శక్తి స్వరూపిణిలా మారిపోయింది.

సంప్రదాయ చీరకట్టులో, భారీ డోలుపై నిలబడి ఆమె వాయించిన తీరుకు అక్కడున్న వారే కాదు, ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఫిదా అయిపోతోంది.

చేతిలో కర్రలు పట్టుకుని, అద్భుతమైన ఎనర్జీతో డోలును దడదడలాడించింది. ఆమె ముఖంలో కనిపించిన ఉత్సాహం, వాయిద్యంలో చూపించిన నైపుణ్యం అందరినీ కట్టిపడేశాయి.

ఆమె ప్రదర్శన చూసి అక్కడున్న వారంతా మంత్రముగ్ధులయ్యారు. కేరింతలు కొడుతూ, చప్పట్లతో ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలదు” అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘ధోల్-తాషా’కు ఎందుకంత క్రేజ్?

వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తొచ్చేది పుణే ‘ధోల్-తాషా’ బ్యాండ్. ఇది కేవలం వాయిద్యాల హోరు కాదు, ఒక సంస్కృతి. వందలాది మంది కళాకారులు ఒకే లయతో, ఉప్పొంగే ఉత్సాహంతో డోలు వాయిస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా వినాయకుడి నిమజ్జన ఊరేగింపుల కోసం ప్రత్యేకంగా పుణే నుంచి ఈ బృందాలను పిలిపిస్తున్నారు. వారి ప్రదర్శన ఊరేగింపుకే కొత్త ఊపునిస్తుంది.