Gangster Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం…ఢిల్లీ లాయర్ కొనుగోలు

అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి,మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యుల ఆస్తులను అధికారులు వేలం వేశారు. రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకా ముంబ్కే గ్రామంలోని నాలుగు భవనాలను ముంబయి ఆయకార్ భవన్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు వేలం నిర్వహించారు....

Gangster Dawood Ibrahim : అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి,మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యుల ఆస్తులను అధికారులు వేలం వేశారు. రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకా ముంబ్కే గ్రామంలోని నాలుగు భవనాలను ముంబయి ఆయకార్ భవన్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు వేలం నిర్వహించారు. ఈ వేలంలో రెండు ఆస్తులు వేలంలో విక్రయించారు. మరో రెండు ఆస్తులకు బిడ్లు రాలేదు. దావూద్ ఇల్లు కేవలం రూ.3.29 లక్షలకే విక్రయించారు.

ALSO READ : Today Headlines: మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ

ఢిల్లీకి చెందిన న్యాయవాది అజయ్ శ్రీవాస్తవ రత్నగిరి జిల్లాలోని ఖేడ్ తహసీల్‌లో ఉన్న పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం కస్కర్ కుటుంబానికి చెందిన రెండు పూర్వీకుల ఆస్తులను శుక్రవారం వేలంలో కొనుగోలు చేశారు. గత తొమ్మిదేళ్లలో గ్యాంగ్‌స్టర్ కుటుంబానికి సంబంధించిన 11 ఆస్తులను అధికారులు బహిరంగ వేలంలో విక్రయించారు. దావూద్ ఇంటి స్థలంలో తాను సనాతన ధర్మ పాఠశాలను ప్రారంభించాలనుకుంటున్నానని శ్రీవాస్తవ చెప్పారు.

ALSO READ : Today Headlines: మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ

‘‘నేను రెండు ప్లాట్లను కొనుగోలు చేశాను, నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను, ప్లాట్ల సర్వే నంబర్‌తో నా పుట్టిన తేదీ సరిపోలినందున భూమిని చాలా ఎక్కువ ధరలకు తీసుకున్నాను. నేను కొన్న ప్లాట్లలో సనాతన్ ధర్మ పాఠశాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను’’ అని శ్రీవాస్తవ చెప్పారు. దావూద్ ప్రాబల్యం ఇకపై లేదని, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వ్యక్తి ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిని అమ్మేశారు.

ట్రెండింగ్ వార్తలు