Gauri Lankesh : గౌరీలంకేష్ హత్య కేసులో నిందితుడికి హైకోర్టు బెయిల్

జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నాయక్ కు మొదటిసారి బెయిల్‌ లభించింది. బెంగళూరు శివార్లలోని కుంబళగోడులో నాయక్ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సాక్షులు చెప్పారు....

Gauri Lankesh

Gauri Lankesh : జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నాయక్ కు మొదటిసారి బెయిల్‌ లభించింది. బెంగళూరు శివార్లలోని కుంబళగోడులో నాయక్ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సాక్షులు చెప్పారు. ఈ కేసులో అసలైన దుండగులకు ఆశ్రయం కల్పించేందుకు అతడు ఇంటిని అద్దెకు తీసుకున్నాడని ప్రాసిక్యూషన్‌ తెలిపింది.

ALSO READ : CM Reventh Reddy : నేటి నుంచి ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ..రేవంత్ స్పీడ్‌

ఈ కేసులో మొత్తం 527 మంది సాక్షులుండగా, వీరిలో 90 మందిని విచారించారు. నాయక్ ఐదేళ్లకు పైగా కస్టడీలో ఉన్నట్లు రికార్డు వెల్లడించింది.నిందితులకు రెగ్యులర్ బెయిల్‌ను గతంలో హైకోర్టు రెండుసార్లు తిరస్కరించింది. నిందితుల తరఫున న్యాయవాది అమర్ కొరియా వాదించారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ ఎ నాయక్ వాదించారు.