NCP chief Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సీఎం షిండే, గౌతం అదానీల రహస్య భేటి

శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్‌నాథ్ షిండే పార్టీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో గతేడాది ప్రభుత్వం కూలిపోయింది.అంతకుముందు ఏప్రిల్‌ నెలలో మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడైన ఎన్సీపీ స్టేట్ చీఫ్ అజిత్ పవార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, అతని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను సహ్యాద్రి అతిథి గృహంలో కలిశారు.

Gautam Adani, CM Eknath Shinde meets NCP chief Sharad Pawar in Mumbai

ముంబయి:ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబయిలో గురువారం రాత్రి మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే,బిలియనీర్ గౌతమ్ అదానీతో వరుసగా భేటీ అవడం సంచలనం రేపింది.(NCP chief Sharad Pawar) ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ముంబయి నగరంలో గురువారం రాత్రి నేషనలిస్ట్ పార్టీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు.ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో(CM Eknath Shinde) పవార్ భేటీ ముగిసిన వెంటనే గౌతమ్ అదానీ సిల్వర్ ఓక్ నివాసంలో పవార్‌ను కలిశారు.ఈ భేటీ గురించి శరద్ పవార్ వెల్లడించలేదు.

ఏప్రిల్ తర్వాత వీరిద్దరి మధ్య ఇది రెండో సమావేశం జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏప్రిల్‌ నెలలో హిండెన్‌బర్గ్ వివాదం తర్వాత బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani) శరద్ పవార్‌ను కలిశారు. అదానీ గ్రూప్‌పై అమెరికా ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ద్వారా స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలు వచ్చాయి.‘‘సింగపూర్ నుంచి వచ్చిన ఒక ప్రతినిధి బృందం నా వద్దకు వచ్చింది.. ఏదైనా సాంకేతిక సమస్యపై పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలవాలనుకున్నారు. గౌతమ్ అదానీ, సింగపూర్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఇది సాంకేతిక సమస్య కాబట్టి దాని గురించి పెద్దగా అర్థం కావడం లేదు’’ అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.

శరద్ పవార్ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో గురువారం సమావేశమయ్యారు. మరాఠా మందిర్ సంస్థ 75వ వ్యవస్థాపక దినోత్సవానికి పవార్ గురువారం సీఎం షిండేను ఆహ్వానించారు.మలబార్ హిల్‌లోని మహారాష్ట్ర సిఎం అధికారిక నివాసం వర్ష బంగ్లాలో షిండేను కలిశారు. ఎన్సీపీ అధినేత పవార్ ముంబయికి చెందిన మరాఠా మందిర్ అధ్యక్షుడిగా ఉన్నారు.మరాఠీ చిత్ర పరిశ్రమ, థియేటర్లతో సంబంధం ఉన్న నటీనటులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సమావేశం నిర్వహించేందుకు సీఎంతో చర్చించినట్లు పవార్ తెలిపారు.2019వ సంవత్సరంలో శివసేనకు బీజేపీతో పొత్తు ముగిసింది.

శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్‌నాథ్ షిండే పార్టీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో గతేడాది ప్రభుత్వం కూలిపోయింది.అంతకుముందు ఏప్రిల్‌ నెలలో మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడైన ఎన్సీపీ స్టేట్ చీఫ్ అజిత్ పవార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, అతని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను సహ్యాద్రి అతిథి గృహంలో కలిశారు. సీఎంను కలిసి వచ్చాక ముంబయిలోని సిల్వర్ ఓక్ నివాసంలో శరద్ పవార్‌ను వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ కూడా కలిశారు. ఈ రెండు వీఐపీ సమావేశాలు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న ఊహాగానాలకు మహారాష్ట్రలో మరోసారి తెరలేచింది.

 

ట్రెండింగ్ వార్తలు