ఎస్బీఐ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్, ఇక ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు

Generate SBI debit card Green PIN: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లు, సౌకర్యాలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తోంది. తద్వారా కస్టమర్లకు సేవలను మరింత సులభతరం చేస్తోంది. తాజాగా మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఎస్బీఐ. ఇప్పుడు ఖాతాదారులు 5 నిమిషాల్లోనే డెబిట్ కమ్ ఏటీఎం కార్డ్ పిన్(గ్రీన్ పిన్ అని కూడా అంటారు) జనరేట్ చేసుకోవచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎంచక్కా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. అదీ మొబైలో లోనే.

ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐ ఖాతాదారులు డెబిట్ కార్డు పిన్ కార్డు జనరేట్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు టోల్ ఫ్రీ ఐవీఆర్ సిస్టమ్ తీసుకొచ్చింది. 1800 112 211 ఫోన్ నెంబర్ కు లేదా 1800 425 3800 ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలి. ఆ తర్వాత పిన్‌ జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్-6 ఎంచుకోవాల‌ని ఎస్బీఐ సూచించింది.

IVR ద్వారా పిన్ జనరేట్ చేసుకునే విధానం:
స్టెప్ 1: కాల్ చేసిన తర్వాత PIN జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6 ఎంచుకోవాలి
స్టెప్ 2: ఎస్‌బీఐ కార్డు మీద ఉన్న నెంబర్, పుట్టిన తేదీ(dd mm yyyy ఫార్మాట్), కార్డు ఎక్స్ పైరీ తేదీ(mm yy ఫార్మాట్) ఎంటర్ చేయాలి
స్టెప్ 3: రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు లేదా మెయిల్ ఐడీకి 6 అంకెల ఓటీపీ వస్తుంది
స్టెప్ 4: నాలుగు అంకెలు ఉండే పిన్ నెంబర్ ఎంచుకోవాలి, దాన్ని రీ కన్ఫామ్ చేసేందుకు మరోసారి టైప్ చేయాలి
స్టెప్ 5: ఆ తరువాత ఐవీఆర్ లో మీ పిన్ జనరేట్ అయిందని నిర్దారణ మెస్సేజ్ వస్తుంది

ట్రెండింగ్ వార్తలు