దీపావళికి తాంత్రిక పూజలు : గుడ్లగూబల స్మగ్లర్లు అరెస్ట్ 

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 10:01 AM IST
దీపావళికి తాంత్రిక పూజలు : గుడ్లగూబల స్మగ్లర్లు అరెస్ట్ 

Updated On : October 23, 2019 / 10:01 AM IST

దసరా పండుగ రోజున పాలపిట్టను చూడాలనే నమ్మకం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాగే దీపావళి పండుగకు ఉత్తరప్రదేశ్ లో గుడ్లగూబ (OWl) లను బలి ఇచ్చే సంప్రదాయం ఉంది. దీంతో దీపావళి దగ్గర పడేకొద్దీ వేటగాళ్లు గుడ్లగూబలను పట్టుకుని అమ్ముతుంటారు. గడ్లగూబలను అమ్మినా కొన్నా నేరం. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా గుడ్లగూడలను అమ్ముతున్న కొంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు.  

వివరాల్లోకి వెళితే..దేశరాజధాని ఢిల్లీకి సమీపంలోని  గజియాబాద్‌లో గుడ్లగూబల వేటగాళ్లను ఇందిరాపురం పోలీసులు అరెస్టు చేశారు.  అత్యంత అరుదైన గుడ్లగూబలతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు గజియాబాద్‌కు చెందిన సుమిత్, ప్రదీప్‌లు‌గా పోలీసులు గుర్తించారు. 

ఈ సందర్భంగా ఘజియాబాద్ ఎస్పీ మనీష్ మిశ్రా  మాట్లాడుతూ..దీపావళి సందర్భంగా తాంత్రిక పూజల పేరిట గుడ్ల గూబలను బలి ఇస్తుంటారని..గుడ్లగూబలు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో నిఘా వేసి గుడ్లగూడలను తరలిస్తున్న ఇద్దరిని పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు.గుడ్లగూబల పట్టుకునే వేటగాళ్లను..వాటిని విక్రయించేవారినీ, కొనుగోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న గుడ్లగూబలను అడవిలో విడిచిపెడతామన్నారు. 

అరుదైన జాతికి చెందిన ఐదు గుడ్లగూబల ధర అంతర్జాతీయ మార్కెట్‌లో కోటి రూపాయల వరకూ ఉండవచ్చని తెలుస్తోంది.  నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు గుడ్లగూడలను ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు. వాటిని వారు ఎక్కడ పట్టుకున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? అనే కోణంలో విచారిస్తున్నారు.