Video: మంచిపని చేయాలని చూస్తే.. 30-40 మంది నా తండ్రి, సోదరుడిపై దాడి చేశారు: వీడియో పోస్ట్ చేసిన యువతి

ఈ వివరాలను లింక్డ్‌ఇన్‌లో మాన్సీ ఎమ్ అనే యువతి తెలిపింది.

తన తండ్రి, సోదరుడిని దాదాపు 30-40 మంది బ్లింకిట్‌ సిబ్బంది బ్యాట్లు, కర్రలతో కొట్టారంటూ ఓ యువతి సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ సెక్టార్ -3 రజందర్ నగర్‌లోని బ్లింకిట్‌ స్టోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పింది.

కొందరు డెలివరీ బాయ్స్‌, హౌసింగ్ సొసైటీ వారు గొడవ పడుతున్న సమయంలో తన తండ్రి ఆపబోయాడని.. ఆ మంచి పని చేయబోయిన పాపానికి తన తండ్రిపై డెలివరీ బాయ్స్‌ దాడి చేశారని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది.

ఘోర ప్రమాదం.. గాల్లో ఢీకొట్టి నదిలో కుప్పకూలిన విమానం, హెలికాప్టర్.. లైవ్ వీడియో

ఈ వివరాలను లింక్డ్‌ఇన్‌లో మాన్సీ ఎమ్ అనే యువతి తెలిపింది. తన తండ్రికి 55 ఏళ్లు ఉంటాయని, ఆయన హృద్రోగి అని వివరించింది. బ్లింకిట్‌ కంపెనీ వద్ద గొడవను ఆపబోయిన తన తండ్రితో పాటు అక్కడే ఉన్న తన సోదరుడిని బ్లింకిట్‌ సిబ్బందవి దుకాణం లోపల లాక్ చేసి, బ్యాట్లు, కర్రలతో దాడి చేశారని తెలిపింది.

ఈ పోస్టును ఆమె జోమాటో అధినేత దీపిందర్‌ గోయల్, బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధైండ్సాకు ట్యాగ్‌ చేసింది. తన తండ్రి, సోదరుడిపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే, నివాస ప్రాంతాలకు దూరంగా బ్లింకిట్‌ స్టోర్‌ను మార్చాలని చెప్పింది.

తాను సెక్టార్ -3, రజందర్ నగర్, ఘజియాబాద్‌లో నివాసం ఉంటానని, తమ నివాస భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బ్లింకిట్ స్టోర్‌ను ఇటీవలే ప్రారంభించారని మాన్సీ తెలిపింది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న ఇక్కడి ప్రాంతం బ్లింకిట్‌ స్టోర్‌ను ప్రారంభించాక గందరగోళంగా తయారైందని పేర్కొంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు స్టోర్‌ వెలుపల స్థానికులకు వేధిస్తున్నారని చెప్పింది. అదే సమయంలో ఉద్యోగం ముగిసి ఇంటికి తిరిగి వస్తున్న తన తండ్రితో పాటు తన సోదరుడిపై దాడి చేశారని తెలిపింది.

Success Story: ఒక్కడితో మొదలై.. వందలాది మందికి బాసటైన యువపారిశ్రామిక వేత్త భరత్ కుమార్ కక్కిరేణి