ఘోర ప్రమాదం.. గాల్లో ఢీకొట్టి నదిలో కుప్పకూలిన విమానం, హెలికాప్టర్.. లైవ్ వీడియో

అమెరికాలోని వాషింగ్టన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికుల విమానం, హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీకున్నాయి.

ఘోర ప్రమాదం.. గాల్లో ఢీకొట్టి నదిలో కుప్పకూలిన విమానం, హెలికాప్టర్.. లైవ్ వీడియో

Plane Crash

Updated On : January 30, 2025 / 12:21 PM IST

Washington: అమెరికాలోని వాషింగ్టన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికుల విమానం, హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీకున్నాయి. రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం, హెలికాప్టర్ ఢీకొని రెండూ ఎయిర్ పోర్టు పక్కనే ఉన్న ఫోటోమాక్ నదిలో కూలిపోయాయి. విమానంలో 60 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: ఓరి దుర్మార్గుడా.. ఫ్రెండ్ ఇంట్లోలేని సమయంలో ముసుగేసుకొని వెళ్లాడు.. ఫ్రెండ్ భార్యను కత్తితో గాయపర్చి..

విమానం, హెలికాప్టర్ ఢీకున్న ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్ లో స్పందించారు. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కాన్సాస్ లోని విషిటా నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. వాషింగ్టన్ సమీపంలోని రీగన్ ఎయిర్ పోర్టు రన్ వేపై దిగేందుకు సిద్ధమవుతున్న క్రమంలో రక్షణ శాఖకు చెందిన సికోర్ స్కీ హెచ్-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను ఢీకొట్టింది. ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇవి రెండూ ఢీకొనడంతో భారీ శబ్దంతోపాటు మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారు.. ఎంత మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారనే సమాచారం తెలియాల్సి ఉంది..

 

ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, డ్రైవర్ల సాయంతో పోటోమాక్ నదిలో గాలిస్తున్నారు. 18మంది మృతదేహాలను వెలికితీసినట్లు తెలిసింది. ప్రమాదం సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నారు. అయితే, విమానం, హెలికాప్టర్ గాలిలోనే ఢీకొని మంటలు చెలరేగడంతో ఎవరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.