Success Story: ఒక్కడితో మొదలై.. వందలాది మందికి బాసటైన యువపారిశ్రామిక వేత్త భరత్ కుమార్ కక్కిరేణి
భరత్ కుమార్ స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులకు సాయం చేయడంలో భరత్ కుమార్ ముందంజలో ఉన్నారు.

Dr Bharath Kumar Kakkireni
ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో ఓ ఉన్నతోద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం సాధించి, కుటుంబ బాధ్యతలు చేపట్టాలని ప్రతి యువకుడి లక్ష్యం. అయితే టెక్నాలజీకి అనుగుణంగా ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని కలల కొలువు సాధించడం తేలికేం కాదు.
ఉద్యోగం సాధించడం అటుంచితే, ఉద్యోగాలను సృష్టించడం అనేది కత్తిమీద సాములాంటి. అయితే ఉద్యోగం సాధించాలనే వయసులోనే నలుగురికి ఉద్యోగాలు ఇవ్వగలగడం ఓ గొప్ప కేవలం అతి కొద్దమందికే సాధ్యం. ఆ అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్ కక్కిరేణి.
నల్లగొండ నుంచి డాలస్ వరకు
డా.భరత్ కుమార్ స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ. స్థానికంగా స్కూల్ విద్య పూర్తి చేసిన ఆయన హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్లారు. డాలస్‌లోని యూనివర్సిటీలో ఎమ్మెస్ పూర్తి చేసిన ఆయన.. ఉద్యోగం సాధించడం కంటే ఉద్యోగాలను సృష్టించడంపైనే దృష్టి పెట్టారు. అందుకు గ్రాడ్యుయేషన్ సమయంలోనే బీజం పడింది.
కేబీకే గ్రూప్ ప్రస్థానం
భరత్ కుమార్ తొలిదశ ప్రస్థానం ఒక చిన్న ఐటీ కంపెనీ స్థాపనతో మొదలైంది. భారత్‌లో చదువుకునే సమయంలోనే తానొక్కడే ఒక చిన్న ఐటీ కంపెనీ నెలకొల్పారు. అమెరికాలో ఎమ్మెస్ పూర్తయిన తర్వాత ఆ కంపెనీని మరింత మందితో విస్తరించారు. అలా ఇంతితై వటుడింతే అన్నట్లు ఒక్కడితో మొదలైన కేబీకే వ్యాపార సామ్రాజ్యం కేబీకే గ్రూప్‌గా అవతరించి నేడు కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బాసటగా నిలిచింది.
“శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది” అనే సూత్రాన్ని బలంగా నమ్మే భరత్ కుమార్ నిరంతరం శ్రమిస్తూ నూతన టెక్నాలజీ ఆధారంగా ఆధునిక వ్యాపారాలను విజయవంతంగా నడుపుతున్నారు. కేబీకే గ్రూప్ ద్వారా నలుగురికీ ఉపాధి కల్పిస్తూ స్వశక్తితో ఎదగాలనుకునే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అమెరికాలో భారతీయ విద్యార్థులకు అండగా..
అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులకు సాయం చేయడంలో భరత్ కుమార్ ముందంజలో ఉన్నారు. ఆయన స్థాపించిన ఐటీ కంపెనీలు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, వారి విజయాలకు మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు అవకాశాలు అందిస్తూ, ఆస్టిన్, టెక్సాస్‌లో ఉన్నత విద్యార్థులకు సంబంధించిన వివిధ సేవలను అందిస్తున్నారు.
ఈక్వినాక్స్ ఐటీ సొల్యూషన్స్, బోన్సాయ్ సొల్యూషన్స్ ద్వారా తగిన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా తన వంతు కృషి చేస్తున్నారు. ఈ కంపెనీల ద్వారా వందలాది మంది భారతీయ విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు రావడంలో తన వంత సాయం అందించారు భరత్ కుమార్.
సరికొత్త మెళకువలతో డిజిటల్ మార్కెటింగ్
ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యాపారం ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ తప్పనిసరి అయ్యింది. సేవలైనా, ఉత్పత్తులైనా అవి వినియోగదారులకు చేరువై వారిని మెప్పించాలంటే డిజిటల్ మార్కెటింగ్‌తోనే సాధ్యం. కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ ద్వారా ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందిస్తున్నారు భరత్ కుమార్.
ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త మెళకువలతో పలు కంపెనీలకు వెబ్ సైట్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు అందిస్తున్నారు. కేబీకే బ్రాడ్ కాస్టింగ్స్ ద్వారా డిజిటల్ యాడ్స్, ప్రమోషన్ వీడియోలు రూపొందిస్తున్నారు. సినిమాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించేందుకు కేబీకే ప్రొడక్షన్స్ ద్వారా షార్ట్ ఫిలింస్ నిర్మిస్తున్నారు. కేబీకే రియల్టర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించారు.
కేబీకే హాస్పిటల్స్‌తో ఆరోగ్య రంగంలోకి..
ఆధునిక కాలంలో ఉరుకులు, పరుగులతో సాగే పని ఒత్తిడి జీవితంలో ఆరోగ్యాన్ని నిత్యం సంరక్షించుకోవడం చాలా అవసరం. ఆ ఆరోగ్య పరిరక్షణ కోసం భరత్ కుమార్ తన వంతుగా సేవలు అందించేందుకు వైద్య రంగంలోకి కూడా అరంగేట్రం చేశారు. కేబీకే హాస్పిటల్స్ నెలకొల్పడం ద్వారా పలు అరుదైన వ్యాధులకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు.
కేబీకే హెర్బల్స్ ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెర్బల్ మెడిసిన్ ను సమకూరుస్తున్నారు. ఇలా తను అడుగుపెట్టిన ప్రతి రంగంలో అభివృద్ది సాధిస్తూ, తన ప్రయాణంలో పరిచయమైన వారికి అవకాశాలిస్తున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త ఉపాధి మార్గాలను అన్వేషిస్తూ, ఉద్యోగాలను సృష్టిస్తూ యువ పారిశ్రామికవేత్తలకు ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు.
నిరుపేదల చదువుకు ఆర్థిక సాయం
కేబీకే గ్రూప్ వ్యాపారాల్లో నిత్యం తలమునకలయ్యే భరత్ కుమార్ తనకు ఈ స్థానం కల్పించిన సమాజానికి కూడా తన వంతుగా తిరిగివ్వాలని సంకల్పించారు. దైవం మానుష రూపేణా అనే నానుడిని నిజం చేస్తూ అనాథల, అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు. కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా నెలనెలా పలు అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఏటా చదువులో రాణించే నిరుపేద అమ్మాయిల ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు.
అరుదైన గౌరవాలు
విభిన్న రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా భరత్ కుమార్ పలు అరుదైన అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. వందే భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సంజీవ రత్న పురస్కార్, రాష్ట్రీయ గౌరవ్ పురస్కార్ అవార్డులు అందుకున్నారు. వ్యాపారాల్లో విజయవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్ 2024 జాబితాలో నిలిచారు.
అమెరికాలో భారీ ఆధ్యాత్మిక కేంద్రం.. హరిహర క్షేత్రం
వ్యాపారంలో విజయాలతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న భరత్ కుమార్ కు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. ఈ ఆధునిక జీవన ప్రయాణంలో మానసిక ప్రశాంతతకు, ఆశావహ దృక్పథానికి ఆధ్యాత్మిక మార్గం ఓ ఉత్తమ పరిష్కారంగా భావిస్తారు ఆయన. అందుకే ఏటా అయ్యప్ప మాల ధరిస్తున్నారు. అమెరికాలోనూ తన ఆధ్యాత్మిక ఆలోచనల అమలుకు శ్రీకారం చుట్టారు.
టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగర శివారులో ఓ భారీ ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణాన్ని తలపెట్టారు. హరిహర క్షేత్రం పేరుతో శైవ, వైష్ణవ క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. జార్జ్ టౌన్ ప్రాంతంలోని 375 కింగ్ రియాలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శివాలయాలతోపాటు గణపతి, అయ్యప్ప స్వామి, దుర్గ, సరస్వతి ఆలయాలను నిర్మిస్తున్నారు. ఓ వైపు ఆలయ నిర్మాణ ముందస్తు పనులు జరుగుతుండగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
ఒక్కడిగా మొదలు పెట్టి, ఓ సైన్యంలా అవతరించిన కేబీకే గ్రూప్ ద్వారా తన వ్యాపార ప్రస్థానంలో 15 వసంతాలు పూర్తి చేసుకొని, 16వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు భరత్ కుమార్. ఈ 15 ఏళ్లలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. నిరంతర శ్రమతో తాను ఎదుగుతూ, తన చుట్టూ ఉండే స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎదిగేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు.