Girl attacked with 'acid'
Girl attacked with ‘acid’: బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు 17 ఏళ్ల ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో కలకలం రేపింది. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇవాళ ఉదయం 7.30 గంటలకు మోహన్ గార్డెన్ ప్రాంతంలో రోడ్డుపక్కన బాధిత అమ్మాయి తన చెల్లితో కలిసి ఉంది.
ఆ సమయంలో ఇద్దరు యువకులు బైకుపై అక్కడకు వచ్చారు. పెద్దమ్మాయిపై యాసిడ్ పోసి బైకుపై పారిపోయారు. ముఖంపై యాసిడ్ పడడంతో బాధిత బాలిక నొప్పితో విలవిలలాడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాలిక యాసిడ్ దాడికి గురైన వెంటనే దీనిపై పోలీసులు స్థానికులు సమాచారం అందించారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాధిత బాలికకు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందుతోందని చెప్పారు. బాధిత బాలిక ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పిందని, వారిలో ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. యాసిడ్ దాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
दिल्ली में एसिड अटैक का मामला
Acid Attack in #Delhi– a girl aged 17 years was allegedly attacked using some acid like substance by two persons on a bike around 7:30am this morning.#acidattack pic.twitter.com/F5sPjnllmg— Rahul Sisodia (@Sisodia19Rahul) December 14, 2022