Love Fail: ప్రియుడి మోసం.. ఇంటి ముందు యువతి రచ్చ.
తానూ ప్రేమించిన యువకుడికి మరో యువతితో పెళ్లి నిశ్చయం కావడంతో ప్రేమికుడి ఇంటిముందు ప్రియురాలు రచ్చ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగింది. గోరఖ్ పూర్ కు చెందిన యువతి, అదే ప్రాంతానికి చెందిన సందీప్ మౌర్యలు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

Love Fail
Love Fail: తాను ప్రేమించిన యువకుడికి మరో యువతితో పెళ్లి నిశ్చయం కావడంతో ప్రేమికుడి ఇంటిముందు ప్రియురాలు రచ్చ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగింది. గోరఖ్ పూర్ కు చెందిన యువతి, అదే ప్రాంతానికి చెందిన సందీప్ మౌర్యలు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు రెండేళ్ల క్రితం బంధువుల ఇంట్లో కలిశారు. అప్పుడే ఒకరినొకరు ఇష్టపడ్డారు.. చెట్టాపట్టాలేసుకుకొని తిరిగారు.
సందీప్ తరచుగా యువతి ఇంటికి వెళ్తుండే వాడు. యువతి కుటుంబ సభ్యులకు వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం తెలుసు. ఇక ఇరు కుటుంబాల్లో వీరి ప్రేమకు ఎవరు అడ్డు చెప్పకపోవడంతో రెండేళ్లపాటు ప్రేమలో మునిగితేలారు. అయితే ఏమైందో ఏమో తెలియదు సందీప్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు. కుటుంబ సభ్యులు మరో యువతిని తీసుకురావడంతో చేసుకుంటానని తల ఊపాడు. దీంతో సందీప్ ఇంట్లోని వారు పెళ్లి పనులు మొదలు పెట్టారు.
ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు బ్యాండ్ వాయించే వారిని తీసుకోని సందీప్ ఇంటివద్దకు వచ్చింది. ఇంటిముందు బ్యాండ్ వాయిస్తూ రచ్చరచ్చ చేసింది. తనను కాదని వేరొకరిని ఎలా చేసుకుంటావంటూ ప్రియుడిని నిలదీసింది. అతడి కుటుంబ సభ్యులను కడిగిపారేసింది. ఇంతలోనే సందీప్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇంటివద్దకు వచ్చారు.
పోలీసులు యువతికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ యువతి పోలీసుల మాట వినలేదు. సందీప్ ప్రేమ పేరుతో తనను వాడుకున్నాడని ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని పోలీసుల ముందు వాపోయింది. దీంతో సదరు యువతికి నచ్చచెప్పిన పోలీసులు ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. యువతిని ఆమెతోపాటు వచ్చిన వారిని ఇంటికి పంపారు.