Girl Molested : కదులుతున్న బస్సులో బాలికపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారం

బస్సులో కూర్చున్న ప్రయాణికులకు అనుమానం వచ్చి క్యాబిన్ డోర్ తెరిచారు. బాలిక దీన స్థితిలో ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారు.

Rajasthan Girl Molested : రాజస్థాన్‌లో ఘోర ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో ఇద్దరు డ్రైవర్లు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సులో కాన్పూర్ నుండి జైపూర్ వెళుతున్న బాలికపై డిసెంబర్ 9 మరియు 10 మధ్య రాత్రులలో ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫూల్‌చంద్ మీనా ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వీడియాకు వెల్లడించారు.

డిసెంబర్ 9 మరియు 10 మధ్య రాత్రి 7:30 గంటల సమయంలో ఒక అమ్మాయి కాన్పూర్ నుండి జైపూర్‌కు బస్సులో తన మామ ఇంటికి వెళుతున్నారు. బాలిక బస్సు ఎక్కినప్పుడు ఆమెకు సీటు దొరక్కపోవడంతో ఆమెను క్యాబిన్ లో కూర్చోబెట్టారు. అయితే కొంత దూరం వెళ్లాక క్యాబిన్‌లోని ఇతర ప్రయాణికులు దిగి వెళ్లిపోయారు. దీంతో ఇద్దరు డ్రైవర్లు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.

Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఐచర్ వాహనం ఢీకొని ముగ్గురు మృతి

బస్సులో కూర్చున్న ప్రయాణికులకు అనుమానం వచ్చి క్యాబిన్ డోర్ తెరిచారు. బాలిక దీన స్థితిలో ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారు. ఇద్దరు డ్రైవర్లలో ఒకరు తప్పించుకోగా, మరో డ్రైవర్ ను పట్టుకున్నారు. ప్రయాణికులు బస్సును నడుపుతూ ఒక పెట్రోల్ పంపు వరకు వెళ్లారని ఏసీబీ మీనా వెల్లడించారు. బాలిక జరిగిన విషయాన్ని ప్రయాణికులకు వెల్లడించడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఫిర్యాదు చేసేందుకు ఆమె మామను అక్కడికి పిలిపించారు. బాలిక, ఆమె మామ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ చెప్పారు. డ్రైవర్లలో ఒకరైన మహ్మద్ ఆరిఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పారిపోయిన మరో డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ లలిత్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Fire Accident : ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ సజీవ దహనం

దేశవ్యాప్తంగా కలకలం రేపిన 2012 డిసెంబర్ లో ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనకు తాజా ఘటనకు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై దారుణంగా దాడి చేసి అత్యాచారం చేశారు. కొన్ని నెలల తర్వాత ఆమె మృతి చెందారు.