Ahmedabad cleric: ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లిం మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇస్లాంకు వ్యతిరేకం: జామా మసీదు షాహీ ఇమామ్

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లిం మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇస్లాంకు వ్యతిరేకమని గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని జామా మసీదు షాహీ ఇమామ్ షబ్బిర్ అహ్మద్ సిద్ధిఖీ చెప్పారు. గుజరాత్ లో రేపు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షబ్బిర్ అహ్మద్ ఎన్నికల గురించి స్పందిస్తూ... ముస్లిం మహిళలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఇస్తే మతాన్ని బలహీనపర్చినట్లే అవుతుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పురుషులే లేరా? అని ప్రశ్నించారు.

Ahmedabad cleric

Ahmedabad cleric: ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లిం మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇస్లాంకు వ్యతిరేకమని గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని జామా మసీదు షాహీ ఇమామ్ షబ్బిర్ అహ్మద్ సిద్ధిఖీ చెప్పారు. గుజరాత్ లో రేపు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షబ్బిర్ అహ్మద్ ఎన్నికల గురించి స్పందిస్తూ… ముస్లిం మహిళలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఇస్తే మతాన్ని బలహీనపర్చినట్లే అవుతుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పురుషులే లేరా? అని ప్రశ్నించారు.

మహిళలకు ఇస్లాంలో ఓ ప్రత్యేక స్థానం ఉందని, వారు నమాజు కూడా చేయకూడదని చెప్పారు. అందుకే వారు మసీదులకు రాకుండా అడ్డుకుంటామని అన్నారు. ఇస్లాంలో మహిళలకు అందుకు అనుమతి ఇస్తే వారిని ఎవరూ అడ్డుకోబోరని చెప్పారు. నమాజుకు ఇస్లాంలో చాలా ప్రాముఖ్యత ఉందని తెలిపారు.

#GujaratElections: వివాహం జరగగానే పెళ్లి పందిరి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి జంట

నమాజు కన్నా ఏదీ ముఖ్యమైనది కాదని తెలిపారు. మహిళలను ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను చేస్తే హిజాబ్ ను కాపాడుకోలేమని అన్నారు. కాగా, ఈ నెల 1న గుజరాత్ లో మొదటి దశ పోలింగ్ జరిగింది. రేపు రెండో దశ ఓటింగ్ జరగనుంది. ఓట్లు వేయడానికి అహ్మదాబాద్ కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వెళ్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..