#GujaratElections: వివాహం జరగగానే పెళ్లి పందిరి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి జంట

అలా చేస్తే ఈ తీపి జ్ఞాపకం జీవితాంతం మిగిలిపోతుందని, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఎప్పటికీ మరింత ముచ్చటగా చూసుకోవచ్చని భావించారు ఆ పెళ్లికూతురు, పెళ్లికొడుకు. పెళ్లి జరిగిన వెంటనే వధూవరులు గుజరాత్ లోని భుజ్ అసెంబ్లీ నియోజక వర్గంలోని 208 పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. వైట్ ఫ్లోరల్ లెహెంగాలో పెళ్లికూతురు, షెర్వానీలో పెళ్లికొడుకు కనపడ్డారు.

#GujaratElections: వివాహం జరగగానే పెళ్లి పందిరి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి జంట

#GujaratElections

#GujaratElections: వివాహం జరగగానే, పెళ్లి పందిరి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసింది ఓ జంట. పెళ్లి దుస్తులతో, పూలదండలతో వారు పోలింగ్ కేంద్రానికి రావడంతో అందరూ వారినే చూస్తూ ఉండిపోయారు. ఇవాళ గుజరాత్ లో తొలి దశ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇదే రోజు భుజ్ అసెంబ్లీ నియోజక వర్గంలో కవిత, వైభవ్ పెళ్లి జరిగింది. వివాహ తంతు ముగియగానే ఓటు వేయాలని ఆ జంట అంతకుముందే నిర్ణయం తీసుకుంది.

అలా చేస్తే ఈ తీపి జ్ఞాపకం జీవితాంతం మిగిలిపోతుందని, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఎప్పటికీ మరింత ముచ్చటగా చూసుకోవచ్చని భావించారు ఆ పెళ్లికూతురు, పెళ్లికొడుకు. పెళ్లి జరిగిన వెంటనే వధూవరులు భుజ్ అసెంబ్లీ నియోజక వర్గంలోని 208 పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు.

#GujaratElections: ఓట్లు వేయడానికి ఊరేగింపుగా వెళ్లిన 60 మంది కుటుంబ సభ్యులు

వైట్ ఫ్లోరల్ లెహెంగాలో పెళ్లికూతురు, షెర్వానీలో పెళ్లికొడుకు కనపడ్డారు. వారితో అక్కడి భద్రతా సిబ్బంది కూడా ఫొటోలు తీసుకోవడం గమనార్హం. వధూవరులతో పాటు వారి స్నేహితులు కూడా కొందరు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సాధారణంగా పెళ్లి జరగగానే వధూవరులు గుడికి వెళ్తుంటారు. వీరు పోలింగ్ కేంద్రానికి వచ్చి, అందరూ ఓటు వేయాలన్న సందేశాన్ని ఇచ్చారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..